Rice Varieties : ఖరీఫ్‌కు అనువైన దీర్ఘకాలిక సన్నవరి రకాలు.. అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు

Rice Varieties : అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే.

Rice Varieties : ఖరీఫ్‌కు అనువైన దీర్ఘకాలిక సన్నవరి రకాలు.. అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు

High Yielding Rice Varieties

Rice Varieties : ఖరీఫ్ కు అనువైన దీర్ఘకాలిక సన్నవరి రకాలు  – సమయానికి అనుకూలంగా సాగుచేస్తే.. అధిక దిగుబడులను పొందవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. రైతులు రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు.

Read Also :  Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. అయితే దీర్థకాలిక సన్న రకాలను సాగుచేసే రైతులు.. ఏ రకాలను ఎంచుకోవాలి.. ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను సాదించవచ్చే తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర రాజు.

ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి  తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే.

మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ.. ఖరీఫ్ కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. సి.హెచ్. దామోదర రాజు.

Read Also :  Vegetables Farming : అంతర పంటలతో అదనపు ఆదాయం.. కూరగాయల సాగుతో.. అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు