Peanut Mealybug : కందిలో శనగపచ్చ పురుగు.. ఈ సూచనలు పాటిస్తే తొలి దశలోనే చెక్ పెట్టొచ్చు!
Peanut Mealybug : రైతులు శనిగపచ్చపురుగు తట్టుకునే రకాను ఎంచుకోవాలి. ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. తొలిదశలో నివారించాలగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు.

Control of peanut mealybug
Peanut Mealybug : ఖరీఫ్ కంది ప్రస్తుతం కాత దశ ఉంది. ఈ దశలో పలు పురుగులు కంది పంటకు ఆశించే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల శనిగ పచ్చపురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురుగుల వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. దీని నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషివిజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ రవి.
అపరాలలో ముఖ్యమైన పంట కంది. తెలుగు రాష్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు రైతులు. ముఖ్యంగా కందిని ఏక పంటగానే కాక, అంతర పంటగాను సాగుచేశారు . వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.
ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. తొలిదశలో నివారించాలగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. శనిగపచ్చపురుగు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషివిజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ రవి.
శనిగపచ్చ పురుగును రసాయన ఎరువులతోనే కాకుండా జీవరసాయనాలను ఉపయోగించి నివారించవచ్చు. అయితే ఏమందు ఏమోతాదులో వాడాలో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. మళ్లీ కంది పంటను సాగుచేయాలకునే రైతులు శనిగపచ్చపురుగు తట్టుకునే రకాను ఎంచుకోవాలి.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
అంతే కాదు గత పంట అవశేషాలు లేకుండా లోతు దుక్కులను చేసుకుంటే శనిగ పచ్చ పురుగును నివారించేందుకు అస్కారముంటుంది. కందిలో ఎరపంటగా బంతి, రక్షక పంటగా మొక్కజొన్నను సాగుచేసుకుంటే అధిక దిగుబడులను తీసేందుకు వీలుంటుంది.