Gulabi Rangu Purugu : పత్తికి గులాబి పురుగు బెడద.. అదిలోనే అరికట్టాలంటున్న శాస్త్రవేత్తలు
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తున్నారు. అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. పత్తిలో బీటీ హైబ్రీడ్ రకాలు వచ్చాక కాయతొలిచే పురుగుల బెడద తగ్గింది.

Gulabi Rangu Purugu Nivaarana
Gulabi Rangu Purugu : మూడేళ్లుగా పత్తి పంటకు గులాబి రంగు పురుగు ప్రమాదకంరంగా మారింది. పత్తిలో బీటీ రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్న రైతులకు ప్రస్తుతం ఈ పురుగు వణుకు పుట్టిస్తోంది. పంట దిగుబడిని, నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ లో పత్తిని సాగు చేసే రైతులు ఈ పురుగు ఉధృతిని పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ పురుగు ఉధృతిని గమనించినట్లైతే మొదట్లోనే తేలికపాటి యాజమాన్య చర్యలు చేపడితే నివారించ వచ్చంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు.
READ ALSO : Chamanthi Sagu : చామంతి సాగులో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం సాగులో మెళకువలు
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తున్నారు. అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. పత్తిలో బీటీ హైబ్రీడ్ రకాలు వచ్చాక కాయతొలిచే పురుగుల బెడద తగ్గింది. ముఖ్యంగా శనిగ పచ్చపురుగు, గులాబీరంగు పురుగు , తలనత్త పురుగు, పొగాకు లద్దెపురుగుల నుండి పత్తి పంటను కాపాడుకోగలిగాము. గత 4 సంవత్సరాల నుండి నెమ్మదిగా గులాబిరంగు పురుగు ఉధృతి పెరిగింది. అంతే కాదు పత్తి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది.
READ ALSO : ladies finger Cultivation : బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. కాయలు పగిలినప్పుడు వెంటనే చిన్న లార్వాలు మెగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్ధాలను తినడం వలన ఆకర్ణ పత్రాలే విప్పుకోకుండా ముడుచుకొనే ఉంటాయి. వీటినే గుడ్డిపూలు అంటారు.
READ ALSO : Vegetable Farming : రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్న నల్గొండ రైతు
ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పొడిని తినడం వలన నష్టం కలుగుతుంది. దీంతో తొలిదశలో ఆశిస్తే మొగ్గలు, పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం కాని, కాయ పరిమాణం పెరగకపోవడం , కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడటం జరుగుతుంది. గుళాబి రంగు కాయ తొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది.
READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు
అయితే గులాబి రంగు పురుగును గుర్తించినట్లైతే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించ వచ్చంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించ కుండానే రైతులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అవసరాన్ని బట్టే రసాయన ఎరువులను పిచికారి చేస్తే పెట్టుబడులు కూడా తగ్గుతాయి.