Bitter Gourd Farming : పందిరి కూరగాయలకు బూడిద తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సలహాలు
తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా వుంది. ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది.

Bitter Gourd Farming
Bitter Gourd Farming : తెలుగు రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగుచేస్తుంటారు. ఇటీవలికాలంలో ఈ పంటలో ట్రెల్లిస్ విధానం రైతుల ఆదరణ పొందుతోంది. ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ, ప్రస్తుత వాతావరణంలో కాకరతోటలకు, బూడిద తెగులు ఉధృతంగా సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగులును నివారించవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషివిజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కోఆర్డినేటర్, డా. జే. హేమంత్ కుమార్.
READ ALSO : Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు
తీగజాతి కూరగాయాల్లో ముఖ్యమైంది కాకర. పోషకాలు ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం. కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగుచేసారు. ప్రస్తుతం బూడిద తెగులు ఉధృతమవటంతో పంటనష్టం ఎక్కువ వుందని రైతులు తెలియజేస్తున్నారు. గాలిలో తేమ, మంచు అధికంగా వున్నప్పుడు ఈ తెగులు ఉధృతి మరింత పెరుగుతుంది.
READ ALSO : Kakara Sagu : శాశ్వత పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు రూ. 80 వేల నికర ఆదాయం
తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా వుంది. ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది. అడ్డు పందిరి కనుక రెండు వరుసల మధ్య అంతరపంటలను కూడా సాగుచేసుకునే వీలుంది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు.