Chilli Plantations : మిరపలో కొమ్మకుళ్లు తెగులు ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Chilli Plantations : కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది.

Chilli Plantations : మిరపలో కొమ్మకుళ్లు తెగులు ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Prevention Of Blight In Chilli Plantations

Updated On : October 6, 2024 / 3:15 PM IST

Chilli Plantations : అధిక వర్షాల వల్ల మిరప తోటల్లో శిలీంధ్రపు బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొయినోఫోరా కొమ్మకుళ్లు తెగులు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెగులును సకాలంలో గుర్తించి నివారించకపోతే శిలీంధ్రం ద్వారా తోటంతా వ్యాపించి, మొక్కలు చనిపోయో ప్రమాధం వుంది. కొయినోఫోరా కొమ్మకుళ్లు లక్షణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు.

కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది. కొంతమంది రైతులు పాలీమల్చింగ్ పద్ధతిలో మిరప సాగుచేసినప్పటికీ ఈ శిలీంధ్రం దాడి నుండి పంటను తప్పించలేకపోయారు.

ఖమ్మం జిల్లాలో వర్షాధారంగా మిరపను జూన్ నుండి ఆగష్టు వరకు, రబీలో నీటిపారుదల కింద, ఆ సెప్టెంబరు నుండి అక్టోబరు మొదటి వారం వరకు మిరప నాటారు. ప్రస్థుతం చాలాతోటల్లో ఈ కొమ్మకుళ్లు వుధృతి అధికంగా కనిపిస్తోంది. సకాలంలో దీన్ని అరికట్టకపోతే, కొమ్మల చివర్ల నుండి మొదలు వరకు ఈ తెగులు వ్యాపించి, మొక్కలు నిలువునా ఎండిపోయే ప్రమాదం వుంది. రైతులు వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వైరా ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్.

Read Also : Sorghum Seeds : రబీకి అనువైన జొన్న రకాలు – మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు