Chamanthi Flower Cultivation : చామంతి పూలసాగులో కొమ్మకత్తిరింపులు, మొక్కలు నాటడంలో మెళకువలు
శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు.

Chamanthi Flower Cultivation
Chamanthi Flower Cultivation : మార్కెట్ లో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ పంటను నాటతారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలు వుండేవి. ప్రస్థుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో వున్నాయి. మంచి మార్కెట్ డిమాండ్ వున్న ఈ పంటనుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పిలకలు, కొమ్మకత్తిరింపులతో పాటు సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య.
READ ALSO : Luffa Cultivation : బీరసాగుతో అధిక లాభాలు పొందుతున్న నెల్లూరు జిల్లా రైతు
పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా వుంది. గిరాకీ ఎక్కువగా ఉండటం, మార్కట్ ధరలు పెరగటం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవటంతో పూల సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు గ్రీన్ హౌసులలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో అన్ని ప్రాంతాల్లోను పూలసాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండు వుంటుంది.
READ ALSO : Cotton Cultivation : ఎత్తు మడులలో.. పత్తిసాగు ఎంతో మేలు
అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. జనవరి ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి. అయితే పిలకల ద్వారా నాటుకున్న మొక్కల్లో శాకీయ పెరుగుదల తక్కువగా ఉంటుంది. కొమ్మకత్తిరింపు ద్వారా వచ్చిన మొక్కల్లో పూర్తిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్క బలంగా , ఆరోగ్యంగా పెరుగుతుంది.
READ ALSO : Diseases in Groundnut : వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు.. అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ
కాబట్టి ఆ మొక్కల నుంచే దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకొని ఫిబ్రవరి, మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి. అవి పిలక మొక్కలుగా తయారై జూన్, జులైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా వుంటుంది.. అంతే కాకుండా విత్తనం ఖర్చుకూడా తగ్గుతుంది. ముఖ్యంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగుచేసి, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య.