Rabi Paddy Varieties : రబీ వరి రకాలు – నారుమడి మెళకువలు

Rabi Paddy Varieties : ఖరీఫ్ లో సాగుచేసిన వరి పంటలు చేతికొచ్చాయి. రెండవ పంటగా, వరిసాగు కోసం , వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతన్నారు .

Rabi Paddy Varieties for Cultivation Techniques

Rabi Paddy Varieties : నీటివసతి కింద, రబీ వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే  విత్తన ఎంపికతో పాటు మేలైన నారుమళ్ల యాజమాన్యం చేపట్టాలి. అసలే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారుకోసం చేపట్టాల్సిన మెళకువలను కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం. శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం..

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

ఖరీఫ్ లో సాగుచేసిన వరి పంటలు చేతికొచ్చాయి. ప్రస్తుతం రెండవ పంటగా, వరిసాగు కోసం , వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతన్నారు . నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో  ఆరుతడి పంటలను సాగును ఎంచుకుంటున్నా..  నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని సాగుచేసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే చాలా మంది వరినారుమడులను పోసుకున్నారు. మరి కొంత మంది పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నారుమడులలో మేలైన యాజమాన్యం చేపట్టినట్లైతే నాణ్యమైన నారు పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు  జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం. శాస్త్రవేత్త విజయ్ .

Read Also : Poultry Farming : చలికాలంలో కోళ్లపై రోగాల దాడి – జాగ్రత్తలు పాటిస్తే అధికోత్పత్తి