Poultry Farming : చలికాలంలో కోళ్లపై రోగాల దాడి – జాగ్రత్తలు పాటిస్తే అధికోత్పత్తి 

Poultry Farming : కోళ్లకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సోకి, కోళ్లు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోడిపిల్లలు మృత్యువాత పడతాయి.

Poultry Farming : చలికాలంలో కోళ్లపై రోగాల దాడి – జాగ్రత్తలు పాటిస్తే అధికోత్పత్తి 

Poultry Farming Nethods

Updated On : January 21, 2025 / 2:05 PM IST

Poultry Farming : శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవటంతో, చలికి మనుషులతో పాటు కోళ్లకు ఇబ్బందులు తప్పటంలేదు. చలి కారణంగా ఫారాల్లో కోళ్ల పెంపకానికి ఇబ్బందిగా మారుతుందని యజమానులు వాపోతున్నారు. వీటి పెంపకానికి సమతుల్య ఉష్ణోగ్రతలు ఎంతో అవసరం. చలికాలంలో కోళ్లఫారాల గదుల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల శిలీంద్రాలు పెరుగుతాయి.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

వీటివల్ల కోళ్లకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సోకి, కోళ్లు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోడిపిల్లలు సైతం అధికంగా మృత్యువాత పడతాయి. ఫారాల్లో కోళ్లను రక్షించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తల తీసుకోవాలో తెలియజేస్తున్నారు పి.వి. వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్‌ప్రొఫెసర్ డా. పురుషోత్తం.

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది రైతులు వ్యవసాయం ఒకటే లాభసాటి కాదని గ్రహించి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన బాయిలర్ , లేయర్ కోళ్ల పెంపకం చేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు. బాయిలర్ కోళ్ళ ద్వారా వచ్చే మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో కొనసాగుతోంది. గుడ్ల ఉత్పత్తిలో 2 వ స్థానంలో ఉంది. బాయిలర్ కోళ్ల పెంపకం కొంత శ్రమ, అధిక రిస్కుఅయినప్పటికీ సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. సాధారణంగా శీతాకాలంలో వాతావరణం అధిక తేమ కలిగి ఉంటుంది.

దీంతో కోళ్లలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో కోళ్ళు ఉంచిన గదిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. లేదంటే కోళ్లు చనిపోవడంతో పాటు.. రైతుకు నష్టం కలిగిస్తుంది. అలాగే విష వాయువులు బయటకు వెళ్ళుటకు, స్వచ్ఛమైన గాలి. లోపలికి వచ్చుటకు తగిన మోతాదులో గాలి ప్రసరణ ఉండేటట్లు చూసుకోవాలి. దాణ, నీరు ఏ విధంగా ఇవ్వాలి, కోళ్లను వెచ్చగా ఉంచేందకు, పెంపకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు, వెటర్నరీ కాలేజి అసిస్టెంట్‌ప్రొఫెసర్ డాక్టర్. పురుషోత్తం

కోళ్లకు తాజా నీరు, దాణా మాత్రమే అందించాలి. పశువైద్య నిపుణుల సూచనల మేరకే తగిన మోతాదులో ఆక్సిటెట్ర్‌సైక్లిన్‌, సప్లాడీమిడిన్‌వంటి యాంటీ బయాటిక్స్‌, ఇతర శానిటైజర్లు, విటమిన్‌లు, దాణా నీరు ఇవ్వాలి. చలికాలంలో రోగాల నిర్మూలనకు వైద్య నిపుణుల సూచనల మేరకు తగు సమయంలో అవసరమైన మేర టీకాలు వేయించి జాగ్రత్త తీసుకోవాలి.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు