Seedling Cultivation : ఆధునిక పద్ధతుల్లో నారు పెంపకం.. రైతులకు తక్కువ ధరకే అందిస్తున్న సీఓఈ
టమాట, వంకాయ, మిరప, కాప్సికమ్ వంటి కూరగాయల నార్లను, ప్రస్తుతం పాలీ హౌసెస్ లలో సాగు చేస్తూ రైతులకు అందిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం కల్పిచిన రాయితీ ధరలతో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నారుమడులను పెంచి, ఔత్సాహిక రైతులకు నిర్ణీత ధరల్లో తక్కువకే అమ్ముతున్నారు. సాధారణంగా మట్టిలో, నీటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.

Seedling Cultivation in a Modern Manner
Seedling Cultivation : కూరగాయలు. వార్షిక పండ్ల రకాల్లో ఆరోగ్యకరమైన నారు ఉత్పత్తితోనే అధిక దిగుబడి సాధ్యం. ప్రస్థుతం హైబ్రిడ్ రకాల విత్తనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సంప్రదాయ పద్ధతుల్లో నారు పెంపకం వల్ల, కావాల్సిన నారు అందుబాటులోకి రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆధునిక పద్ధతుల్లో నారు పెంచే విధానాన్ని రైతులకు పరిచయం చేస్తోంది. హైద్రాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్. ఇక్కడ పెంచిన నారుతో, పంటసాగుచేస్తే 30శాతం అధిక దిగుబడి సాధించవచ్చని అధికారులు రుజువు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు ఈ విధానంపై ఆసక్తిని చూపుతున్నారు.
READ ALSO : Polyhouse : పాలిహౌస్ సాగులో నులిపురుగుల సమస్య
సంప్రదాయ పద్ధతిలో నారు పోసుకునే విధానంలో ఉన్న లోపాలను సవరిస్తూ, నూతన పద్ధతిలో నారు మడులను పెంచే రీతికి తెర లేపింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ విభాగం. మామూలుగా నారుమళ్లలో విత్తనాలు నాటేవిధానంలో.. కొన్ని మొలకలు రాకపోవడం, ఇంకొన్ని ఆలస్యంగా మొలకెత్తడం, మరికొన్ని కుళ్లిపోవడం, చీడ పీడలకి గురికావడం, కలుపు మొక్కలు పెరగటం, కూలీ ఖర్చులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి మూలంగా రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు.
అయితే ఆధునిక నారుమడి ఆలోచనతో పాలీహౌస్ లలో, ఒక క్రమ విధానం ద్వారా నర్సరీల్లో నారుమడి పోసి, ప్రాసెస్ చేయడం ద్వారా మూడు రోజుల్లో అన్ని విత్తనాలు ఒకే సైజులో మొలక మొలుస్తాయి. నారుకుళ్లు సమస్య వుండదు. కలుపు, కూలీ ఖర్చు, విత్తన మొలక సమస్య ఉండవు. విత్తిన ప్రతీ విత్తనం నుంచి మొలక సాధించే అవకాశం ఏర్పడుతుంది. వీటిని 30 నుంచి 45 రోజులు నిర్ణీత పద్ధతుల్లో పెంచుతారు. ఆ తరువాత మొక్కలను ప్యాక్ చేసి, ముందుగా డబ్బు కట్టి, ఆర్డర్ బుక్ చేసుకున్న రైతులకు అందజేయడం జరుగుతుంది. కొనుగోలు చేసుకున్న రైతులు వాటిని తమ పొలంలో నాటుకుని సాగు చేయడం ద్వారా ఏక కాలంలో అన్ని మొక్కల నుంచి ఒకే సారి దిగుబడిని పొందే వీలుంటుంది అంటున్నారు అధికారులు.
READ ALSO : Rugose white : కొబ్బరి, పామాయిల్ తోటల్లో రూగోస్ తెల్లదోమ నివారణ
టమాట, వంకాయ, మిరప, కాప్సికమ్ వంటి కూరగాయల నార్లను, ప్రస్తుతం పాలీ హౌసెస్ లలో సాగు చేస్తూ రైతులకు అందిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం కల్పిచిన రాయితీ ధరలతో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నారుమడులను పెంచి, ఔత్సాహిక రైతులకు నిర్ణీత ధరల్లో తక్కువకే అమ్ముతున్నారు. సాధారణంగా మట్టిలో, నీటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కనుక సంప్రదాయ సాగు విధానంతో నారుమళ్లు పెంచినప్పుడు విత్తనాల నుండి పూర్తిస్థాయిలో మొలకశాతం సాధించలేము. వర్షాభావ పరిస్థితుల్లో ఈ విధానం రైతులకు మరింత నష్టాన్నిమిగులుస్తుంది. బోరు బావి నీళ్ళు వినియోగించడంతో మొలక శాతంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. భూమిలో ఉండే ధాతువులకి ఉప్పు నీరు తోడైనప్పుడు ఎలక్ట్రికల్ కండక్టివిటీ పెరిగి పంట సమస్యలు వస్తాయి.
సాధారణ వ్యవసాయ పద్ధతిలో వస్తున్న సమస్యలకు స్వస్తీ చెప్పేందుకు నూతన నారు విధానం సమాధానంగా నిలిచింది. ఈ పద్ధతిలో వివిధ దశలు మొక్కల పెరుగుదలకి సహక రిస్తున్నాయి. మొదటి దశలో కోకోపీట్ బ్రిక్స్ ఒక తొట్టిలో 24గం. నానబెట్టి ఆతరువాత నీటిని వడగట్టి 3:1:1 రేషియోలో 3శాతం కోకోపేట్, 1శాతం పర్లైట్, 1శాతం వర్మిక్యులైట్ కలిపి ఆటోమేటిక్ సీలింగ్ మిషన్ ద్వారా విత్తనాలను క్యూబ్ ట్రెలల్లో విత్తుతారు. అక్కడినుంచి రెండో దశ, మూడో దశల వారీగా మొక్కలను పెంచుతారు. ఈ పద్ధతిలో విత్తనాలు వృధాకాకుండా 100శాతం మొలక వస్తుంది.
READ ALSO : Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా చేస్తున్న ఆలోచనలకి అనుగుణంగా రైతన్నలు కూడా అడుగులు కదిపితే… భవిష్య రోజుల్లో నష్టాల ఊబి నుండి తనను తాను రక్షించుకునే వాడు అవుతాడు. ఈ ఆధునిక నారు విధానం విజయ వంతం అయితే రాబోయే రోజుల్లో మరిన్ని నూతన వ్యవసాయ విధానాలకు ప్రభుత్వాలు పునాదులను సిద్ధం చేస్తున్నాయి.