Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే

ఆధునిక పోకడలవల్ల, జెర్బరా పూల వాడకం విరివిగా పెరగింది. డిమాండ్ కన్నా సప్లయి తక్కువగా వుండటంతో, ఆధునిక పద్ధతుల్లో , ముఖ్యంగా పాలీహౌస్ లలో వీటి సాగు రైతుకు కల్పతరువుగా మారింది.

Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే

New Project (4)

Gerbera Farming: ఆధునిక పోకడలవల్ల, జెర్బరా పూల వాడకం విరివిగా పెరగింది. డిమాండ్ కన్నా సప్లయి తక్కువగా వుండటంతో, ఆధునిక పద్ధతుల్లో , ముఖ్యంగా పాలీహౌస్ లలో వీటి సాగు రైతుకు కల్పతరువుగా మారింది. ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా వున్నా, సంప్రదాయ సాగుతోపోలిస్తే, అతి తక్కువ విస్తీర్ణంలో3 నుండి 5 రెట్ల అధిక దిగుబడిని పొందే అవకాశం వుంది. అయితే జెర్బరా పూలసాగు చేపట్టే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఇది సాధ్యమవుతుంది. మరి ఆ యాజమాన్య పద్ధతులను ఏంటో నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్ ద్వారా తెలుసుకుందాం.

రోజురోజుకు పూలకు డిమాండ్ పెరుగుతుండటం వల్ల, మార్కెట్‌లో సాధారణ పూలతోపాటు, అలంకరణ పూల అమ్మకాలు, కొనుగోళ్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. దీంతో రైతులు కూడా వ్యవసాయానికి భిన్నంగా ఉద్యాన పంటల సాగువైపు ధృష్టి సారిస్తున్నారు. కొందరు రైతులు మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న కట్ ఫ్లవర్స్ ను పాలీహౌస్ లలో పెంచుతూ .. తక్కువ విస్తీర్ణంలోనే మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు.

పాలీ హౌస్ సాంకేతిక పరిజ్ఞానంతో … వాతావరణంలో త్వర త్వరగా వచ్చే మార్పులను తట్టుకుని, సులభంగా పంటలను పండించే వీలుంటుంది. కాలం కాని కాలంలో నారు మొక్కలను పెంచుకుని, కాలానికి ముందుగా నాటుకుని గిరాకీ వున్న కాలంలో అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం వుంటుంది. వీటిలో అన్ని రకాల ఉద్యాన పంటలను సాగుచేసే అవకాశం వున్నప్పటికీ పెట్టుబడి ఎక్కువగా వుంటుంది కనుక అధిక వ్యాపార విలువ కలిగిన పంటల సాగు రైతుకు లాభదాయకంగా వుంటుంది.

………………………………………. పత్తిలో తెగుళ్ల నివారణ

తెలంగాణలో ప్రధానంగా ఎగుమతి ప్రాధాన్యం వున్న కాప్సికం మిర్చిని, పూలలో జెర్బరా, కార్నేషన్ వంటి కట్ ఫ్లవర్స్ రకాలను సాగుచేస్తున్నారు. శుభకార్యాలు, బొకేల తయారీలో అలంకరణ పూలకు నానాటికీ ప్రాధాన్యత పెరుగుతుండటంతో వీటి సాగు రైతులకు కాసులు కురిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో చుట్టు ప్రక్కల అధిక సంఖ్యలో జెర్బరా పూల సాగు చేపడుతున్నారు రైతులు. ఒకసారి నాటితే మూడు ఏళ్ల పాటు దిగుబడులను పొందవచ్చు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే మాత్రం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు నల్గొండ జిల్లా , నకిరేకల్ నియోజకవర్గం ఉద్యానశాఖ అధికారి విద్యాసాగర్.

కీలక సూచనలు:
* ముఖ్యంగా జెర్బరా సాగులో నాణ్యమైన పూల దిగుబడిని పొందాలంటే పొషకాలను సకాలంలో అందించాలి. ఇందుకోసం ఒక చార్ట్ సిద్ధం చేసుకొవాలి. సూక్ష్మ పోషకాలు, నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. దీంతో పువ్వులు పెద్దసైజులో వచ్చి మార్కెట్ లో మంచి ధర పలికేందుకు అవకాశం ఉంటుంది.
* పాలీహౌజ్ లలో పెంచే పూలకు చీడపీడలు కూడా అధికంగానే ఉంటాయి. అయితే రైతులు తెలియక పొషకాలతో కలిపి, పురుగుమందులను పిచికారి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణంగా పురుగులను నివారించలేము. రసాయన పురుగు మందులతో పాటు వేపనూనె, కానుగ నూనె లాంటివి కలిపి పిచికారి చేయవచ్చు.
* నాణ్యమైన జెర్బరా పూల ఉత్పత్తి ఎంత ముఖ్యమో.. వాటిని మార్కెటింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా వరకు రైతులు డిమాండ్ ఉన్నప్పుడు పూలను కోసి అమ్మడం, లేనప్పుడు అలాగే వదిలేస్తుంటారు. దీంతో పాలీహౌస్ లో పూలు చెడిపోయి ఫంగస్ గా తయారై అన్ని మొక్కలకు వ్యాపించి నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ లేని సమయంలో కూడా పూల కోసి బయట పడేయడం వల్ల ఇతర మొక్కలకు నష్టం జరగకుండా చూడవచ్చు.