Honey Bee Farming : తేనెటీగల పెంపకంలో స్కేటింగ్ కోచ్.. నెలకు లక్షరూపాయల సంపాదన

తేనె ఉత్పత్తి ద్వారా నెలకు 50 వేల నుండి లక్ష రూపాయల నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తికాదు. కాకపోతే తేనెటీగల పట్ల అవగాహన ఉండి.. ఏసీజన్ లో ఏపంటలు పండుతాయి.. ఎక్కడైతే అధికంగా మకరందం దొరుకుతుందో అక్కడికి రవాణ చేస్తుంటే అధిక తేనె దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

Honey Bee Farming : మార్కెట్‌లో మ‌న‌కు ర‌క‌ర‌కాల కంపెనీల‌కు చెందిన తేనెలు అందుబాటులో ఉన్నాయి. కొంద‌రు ఈ తేనెలపై న‌మ్మ‌కం లేక తేనెటీగ‌ల పెంప‌కందారుల వ‌ద్దకే వెళ్లి స్వ‌చ్ఛ‌మైన తేనెను కొంటుంటారు. అయితే నిజానికి తేనెటీగ‌ల పెంప‌కం, తేనె అమ్మ‌డం ద్వారా నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదిస్తున్నారు. దీన్ని చూసే వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. తేనెటీగల పెంపకం చేపట్టాడు. వచ్చిన తేనెను సొంత బ్రాండ్ పైనే ఔట్ లెట్ ఏర్పాటు చేసి అమ్ముతూ..  మంచి లాభాలు పొందుతున్నాడు .

READ ALSO : Gherkin Cultivation : గెర్కిన్స్ సాగు.. లక్షల్లో ఆదాయం

వరంగల్ కు చెందిన ఈయన డిగ్రీ వరకు చదువుకున్నారు. స్వతహాగా  స్కేటింగ్ ప్లేయర్ కావడం.. స్థానికంగా కోచ్ గా కొన్నేళ్లపాటు పనిచేశారు. అయితే కరోనా సమయంలో తన ఉపాధి పోవడమే కాకుండా, తన తల్లికి కరోనా సోకడం .. డాక్టర్ల సలహాతో ప్రతిరోజు తేనె నిమ్మరసంలో కలిపి ఇవ్వమనడంతో.. స్వచ్ఛమైన తేనె కోసం వెదికాడు.. ఎక్కడ దొరకలేదు. దీంతో యూట్యూబ్ లో సర్చ్ చేయగా.. తేనెటీగల పెంపకంతో ఉపాధి పొందుతున్న వారిని చూసి తానుకూడా పెంచాలనుకున్నారు.

READ ALSO : Honey Collection : తేనెటీగల పెంపకంలో ఆదివాసీ మహిళలు

ఇందుకోసం హైదరాబాద్ లో తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. మొదట 12 పెట్టెలతో ప్రారంభించారు. అయితే అనుభం తక్కువగా ఉండటంచేత అంతగా లాభాలు రాలేదు. అయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు. ప్రస్తుతం 450 పెట్టెలతో తేనె ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే ఔట్ లెట్ ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు 80 నుండి 1 లక్ష రూపాయల వరకు సంపాధిస్తున్నారు.

READ ALSO : Cultivation Techniques : వేసవి దుక్కులతో పెరగనున్న భూసారం

భూమిలేని నిరుపేదలు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధినిస్తున్న ఈ పరిశ్రమలో, లాభాలకు కొదవలేదు. సంవత్సరం పొడవునా తేనే ఉత్పత్తి వుండటం, ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా, ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. తేనె ఉత్పత్తి ద్వారా నెలకు 50 వేల నుండి లక్ష రూపాయల నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తికాదు. కాకపోతే తేనెటీగల పట్ల అవగాహన ఉండి.. ఏసీజన్ లో ఏపంటలు పండుతాయి.. ఎక్కడైతే అధికంగా మకరందం దొరుకుతుందో అక్కడికి రవాణ చేస్తుంటే అధిక తేనె దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది..

ట్రెండింగ్ వార్తలు