Cultivation Techniques : వేసవి దుక్కులతో పెరగనున్న భూసారం

వానకాలం, యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు చాలా మంది రైతులు . అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి, భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి.

Cultivation Techniques : వేసవి దుక్కులతో పెరగనున్న భూసారం

Cultivation Techniques

Cultivation Techniques : యాసంగి సీజన్‌ దాదాపుగా ముగుస్తోంది . రైతులు సాగుచేసిన పంట ఉత్పత్తులు చేతికి వస్తున్నాయి. సాగు భూములు కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం వేసవి దుక్కులకు, భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైనా సమయం. ముఖ్యంగా వేసవిదుక్కులు చేయడం వల్ల, వానకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు

వానకాలం, యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు చాలా మంది రైతులు . అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి, భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా, భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరై పోయే ప్రమాదం ఉంది.

READ ALSO : Sugarcane Cultivation : చెరకుసాగులో నీటి పారుదల, ఎరువుల యాజమాన్యం..

కాబట్టి వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల, తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమశాతం పెరుగుతుంది.

READ ALSO : Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత.. అధిగమించేందుకు యాంత్రీకరణ

వేసవి దుక్కులతో పంటకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా కలుపు, చీడపీడల ఉధృత్తి తగ్గుతుంది. కాబట్టి రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక సారైనా, వేసవిలో లోతు దుక్కులను చేసుకోవటం మంచిదని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత డా. నీలవేణి.