Gherkin Cultivation : గెర్కిన్స్ సాగు.. లక్షల్లో ఆదాయం

గెర్కిన్ సాగుకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుకూల వాతావరణం ఉండటంతో వివిధ కంపెనీలు రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకొని సాగుచేయిస్తున్నాయి. అలా 6 ఏళ్ల పాటు సాగుచేస్తూ.. అతితక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నిర్మల్ జిల్లాకు చెంది  రైతు గోపి.

Gherkin Cultivation : గెర్కిన్స్ సాగు.. లక్షల్లో ఆదాయం

Gherkin Cultivation

Gherkin Cultivation : కాలం కలసిరాకపోతే అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలసాగువైపు మొగ్గుచూపడం సర్వసాధారణం. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడులు.. ఆధునిక పద్ధతుల్లో అధిక లాభాలు ఆర్జించి పెట్టే పంటయితే రైతుకు ఇంకా ఏం కావాలి.. అదే కోవకు చెందిన పంట గెర్కిన్‌ . ప్రపంచ దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న పంటగా గెర్కిన్ గుర్తింపు పొందింది. దోసజాతి పంట అయినప్పటికీ.. దీనిలో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాలు వల్ల ఇతర దేశాల్లో దీని వాడకం విస్తృతంగా ఉంది.

READ ALSO : Cucumber Crop : దోసతోటలో బోరాన్ లోపం నివారణ

అయితే గెర్కిన్ సాగుకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుకూల వాతావరణం ఉండటంతో వివిధ కంపెనీలు రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకొని సాగుచేయిస్తున్నాయి. అలా 6 ఏళ్ల పాటు సాగుచేస్తూ.. అతితక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నిర్మల్ జిల్లాకు చెంది  రైతు గోపి. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే 6 ఏళ్ళుగా గెర్కిన్ సాగు చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు.. లక్ష్మణ్ చందా మండలం, పీచర్ గ్రామానికి చెందిన రైతు గోపి .

చూడటానికిగాను అచ్చం దోసతీగలాగా కనిపించే గెర్కిన్ పైరు శాస్త్రీయ నామం కుకుమిస్ సెటైవస్. గెర్కిన్ కీరా దోసకాయను పోలి ఉంటుంది. దొండకాయ మాదిరిగానే కనిపిస్తుంది. విత్తనం నాటిన దగ్గర నుంచి కేవలం 30 నుండి 40 రోజుల్లోనే తొలిసారిగా కోతకు వస్తుంది. ఒకొక్క ఎకరానికి గాను సుమారు 8 నుండి 10 టన్నుల పంట దిగుబడి వస్తుంది. వీటని సౌందర్య క్రీముల తయారీలో, ఆహారంగా ఉపయోగిస్తారు.

READ ALSO : Polyhouses : మూవింగ్ పాలిహౌస్ లతో సాగు.. బహుబాగు

మనిషి శరీరంలోని నీటి శాతాన్ని పెంచడం, క్యాన్సర్ కారకాలను నిరోధించడం, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడం లాంటి కీలకమైన వ్యాధులకు మందుల తయారీకి వీటిని వినియోగిస్తారు. అలాంటి ఈ పంటను కొన్ని కంపెనీలు భైబ్యాక్ ఒప్పందంతో విత్తానాలు, ఎరువులు అందించి సాగుచేయిస్తున్నారు. కంపెనీ ప్రతినిధుల సలహాలు, సూచనలతో పంట సాగుచేసి మంచి దిగుబడులు తీస్తున్నారు రైతు గోపి. వచ్చిన పంటను వ్యవసాయ క్షేత్రం వద్దే కొనుగోలు చేస్తుండటంతో..  తక్కువ పెట్టుబడితోనే, అధిక లాభాలు వస్తున్నాయంటున్నారు రైతు గోపి.