Honey Collection : తేనెటీగల పెంపకంలో ఆదివాసీ మహిళలు

మహిళలు సేకరించిన తేనెను గ్రామీణ అభివృద్ధి సంస్థ కొనుగోలు చేసి వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన కార్మాగారంలో శుద్ధి చేస్తున్నారు. అటవి తేనె ఉత్పత్తిని వినియోగదారులకు అందిస్తున్నారు. అంతే కాదు బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీకి సప్లై చేస్తున్నారు.

Honey Collection : తేనెటీగల పెంపకంలో ఆదివాసీ మహిళలు

Tribal women in honey collection

Honey Collection : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ పరిశ్రమ తేనెటీగల పెంపకం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పరిశ్రమ ద్వారా, రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దేశ విదేశాల్లో తేనె ఉత్పత్తులకు నానాటికీ డిమాండ్ పెరగుతుండటం వల్ల, దేశీయంగా ఈ పరిశ్రమను విస్తరించేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది.

READ ALSO : Honey Health Benefits : పంచదారకు బదులుగా తేనె వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

ఆదివాసి మహిళలు  తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకుని, తేనే వ్యాపారంలోకి అడుగులు వేస్తున్నారు.  గ్రామీణాభివృద్ధి అధికారుల ప్రొత్సాహంతో  తేనేటీగల పెపంకలంలో రాణిస్తున్నారు. జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమ ద్వారా రాయితీ పై  తేనేటీగల యూనిట్లు మంజూరు చేస్తోంది.

కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలొని నాగల్ గోంది గ్రామానికి చెందిన అత్యంత వెనుకబడిన ఆదివాసి మహిళలు తొలిసారిగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టి మెరుగైన ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొన్ని ఎన్.జి.వో సంస్థలతో కలిసి తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న యువతకు, రైతులకు శిక్షణ ఇస్తోంది.

READ ALSO : Beekeeping : తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు!

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే అద్భుతమైన వనరుల్లో తేనెను, మానవజాతిపాలిట వరప్రసాదంగా చెప్పవచ్చు. వివిధ రకాల పంటలు, చెట్ల పూల నుంచి, తేనెటీగలు సేకరించే తియ్యని మకరందమే తేనె. ఇది వెలకట్టలేనిది. స్వచ్చమైన తేనె ఎన్నటికీ చెడిపోదు. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె, క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆయిర్వేదంలో దీనికి సర్వరోగ నివారిణిగా పేరుంది.

ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే తేనె, ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. చెక్క పెట్టెల్లో ఫ్రేముల అమర్చి, తేనెటీగలను మచ్చిక చేసుకోవటంద్వారా.. కృత్రిమంగా పెంచే ఈ పెంపకం ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. తక్కువ పెట్టుబడితో మంచి ఫలితాలను ఇస్తున్నఈ పరిశ్రమ నేడు దినదినాభివృద్ధి చెందుతోంది. అందుకే చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని నిరుపేదలకు చక్కటి ఉపాధినందించే చిన్నతరహా పరిశ్రమగా రూపుదిద్దుకుంది.

READ ALSO : Date Fruits With Honey : తేనెతో కలిపి ఖర్జూర పండ్లు ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలు!

అందుకే మహిళా సంఘాలు, అత్యంత వెనుకబడిన వారి అభివృద్ధికోసం తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగానే కొమురంభీం ఆసీఫాబాద్ జిల్లా, కేరామేరి మండలం, నాగల్ గొంది గ్రామంలోని అత్యంత వెనుకబడిన కోలం తెగకు చెందిన ఆదివాసి మహిళలకు  గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తేనెటీగల పెంపకం పట్ల శిక్షణ ఇచ్చి, వారికి ఖాదీ గ్రామీణ పరిశ్రమ ద్వారా రాయితీ పై  తేనేటీగల యూనిట్ల ద్వారా తేనెటీగల యూనిట్లు అందించారు. ఇప్పుడు ఈ ఆదివాసి మహిళలు అడవుల్లో పెట్టెలను ఏర్పాటుచేసి తేనె సేకరణలో నిమగ్నమయ్యారు.

మహిళలు సేకరించిన తేనెను గ్రామీణ అభివృద్ధి సంస్థ కొనుగోలు చేసి వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన కార్మాగారంలో శుద్ధి చేస్తున్నారు. అటవి తేనె ఉత్పత్తిని వినియోగదారులకు అందిస్తున్నారు. అంతే కాదు బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీకి సప్లై చేస్తున్నారు. తేనె సేకరణతో ఇటు ఆదివాసీల ఆర్ధిక స్థితి మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.

READ ALSO : Honey Benefits : ప్రతీరోజూ మన ఆహారంలో తేనెను భాగంగా చేసుకుంటే కలిగే లాభాలు ఇవే!

తేనెటీగల పెంపకం చాలా సులభం. తగిన శిక్షణ తీసుకుంటే ఎవరైనా ఈ పరిశ్రమను నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఆదివాసి మహిళలకు ఇటువంటి అవకాశం కల్పించడం చాలా సంతోషించదగ్గ విషయం. అట్టడుగున ఉన్న గ్రామీణులకు ఇలాగే మరిన్ని అవకాశాలు కల్పించి.. వారు ఆర్ధికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు చేయూతనందించాలని కోరుకుందాం…