Sorghum Cultivation Process : కంది పంట సాగులో పాటించాల్సిన మెళకువలు.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు 

Sorghum Cultivation Process : ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు

Sorghum Cultivation Process : కంది పంట సాగులో పాటించాల్సిన మెళకువలు.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు 

techniques to be followed in kandi crop cultivation

Sorghum Cultivation Process : అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో సాగు మరింత లాభసాటిగా మారింది . దీనికి తోడు గత కొంత కాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

తెలుగురాష్ర్టాలలో సాగవుతున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12లక్షల ఎకరాలలో సాగవుతుంది. తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 10 లక్షల ఎకరాల్లో  సాగైంది.  కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది. ఈపంటలో ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా, మన రైతులు మాత్రం  కేవలం నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.

వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. అంతే కాదు భూసారాన్ని  అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది.  మొత్తంగా విత్తనం మొదలు పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే , నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుదని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్.

కంది పూత పింద దశలో చీడపీడలు ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మారుకా మచ్చల పురుగు రైతులకు తలనొప్పిగా మారింది . పూతను కాయలను గూళ్లుగా చేసి లోపలి పధార్థాలను తినేసే ఈ పురుగు వల్ల రైతుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు 80శాతం దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం వుంది. దీనిపై ప్రత్యేక నిఘా వుండాలంటారు శాస్త్రవేత్త.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు