Paddy Cultivation : ఖరీఫ్ వరినాట్లలో మెళకువలు

ఖరీఫ్ వరిసాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ, మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న  రైతాంగం  నారు వయసు 30రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది.

Paddy Cultivation : ఖరీఫ్ వరినాట్లలో మెళకువలు

Paddy Cultivation

Updated On : September 2, 2023 / 6:02 PM IST

Paddy Cultivation : ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఏడాది వరినాట్లు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ముందుగా నార్లు పోసుకున్న రైతులు ఇప్పటికే వరినాట్లు వేశారు.  బోర్లు, బావులు, కాలువల కింద వరినారు పోసుకున్న రైతాంగం నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు . అయితే ఖరీఫ్ వరిలో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

కాబట్టి.. వరినారుమడి నుండే మెళకువలు పాటించాలి. ప్రస్తుతం వరినాట్లు వేసే రైతులు ఎంలాంటి యాజమాన్యం పాటించాలో తెలియజేస్తున్నారు రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. పాలడుగు సత్యనారాయణ.

ఖరీఫ్ వరిసాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ, మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న  రైతాంగం  నారు వయసు 30రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల సకాలంలో నాట్లు వేయటం పూర్తిచేయాలి.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి. గట్లు వెడల్పుగా వుంటే కలుపు పాటు, ఎలుకల బెడద ఎక్కువవుతుంది. నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటే మూన త్వరగా తిరుగుతుంది.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

నాటడానికి నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగిన నారును ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు ప్రతికూల పరిస్థితులను అధిగమించే విధంగా రైతాంగం ముందడుగు వేయాలి. వరినాట్లు వేసేటప్పుడు రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. పాలడుగు సత్యనారాయణ.