Marigold Flower Farming : బంతిపూల సాగులో మేలైన యాజమాన్యం – లాభాల పంట అంటున్న శాస్త్రవేత్తలు
Marigold Flower Farming : పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.

Techniques in Marigold Flower Farming
Marigold Flower Farming : వాణిజ్యపరంగా సాగుచేసే పూలలో బంతి ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది.. అందుకే, వీటి సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు.
Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ
అయితే, చాలామంది రైతులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 80 నుంచి 120 క్వింటాళ్ల దాకా దిగుబడి సాధించవచ్చని తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. బంతిపూల పంటకాలం 120రోజులు కాగా, నాటిన 55 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది. అంతేకాకుండా, వీటిని ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉన్నది. అందుకే.. ఏయేటి కాయేడు ‘బంతి’ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది.
అయితే రైతులు మాత్రం అనుకున్నంత దిగుబడిని సాధించలేక పోతున్నారు. ప్రణాళిక బద్ధంగా పూలసాగు చేపట్టి.. సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లైతే ఎకరాకు సూటి రకాలైతే, 8 నుండి 10 టన్నులు, అదే హైబ్రీడ్ రకాలైతే 12 నుండి 15 టన్నుల దిగుబడిని సాధించవచ్చని సమగ్ర బంతి సాగు యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి.
బంతికి పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చపురుగు, నులిపురుగు, నల్లి, తామర పురుగు, పేనుబంక ఆశిస్తాయి. వీటికి తోడు మొగ్గకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు సోకుతాయి. కాబట్టి, సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. ఏ రకాలైనా ఎకరానికి 4-5 టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. బాగా విచ్చుకున్న బంతి పూలనే కోయాలి. ఉదయం కానీ, సాయంత్రం కానీ కోస్తే మంచిది. కోతకు ముందు నీటి తడి ఇస్తే.. పూల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కోత తరువాత కూడా పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. సకాలంలో పూల కోత చేస్తుంటే.. దిగుబడి పెరుగుతుంది.
Read Also : Diseases On Animals : వర్షాకాలంలో జీవాలకు ఆశించే వ్యాధులు – నివారణ ఆచరించాల్సిన పద్ధతులు