Diseases On Animals : వర్షాకాలంలో జీవాలకు ఆశించే వ్యాధులు – నివారణ ఆచరించాల్సిన పద్ధతులు

Diseases On Animals : జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు. 

Diseases On Animals : వర్షాకాలంలో జీవాలకు ఆశించే వ్యాధులు – నివారణ ఆచరించాల్సిన పద్ధతులు

Rainy Season Diseases On Animals

Updated On : September 24, 2024 / 4:28 PM IST

Diseases On Animals : ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి . వర్షాలు ఆలస్యమైనా చాలా వరకు చిరుజల్లులు పడటంతో అక్కడక్కడ పచ్చిక బయళ్లు పెరిగాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పెరిగిన కొత్తచిగుళ్లను అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ మూడు నెలలు అప్రమత్తంగా వుండాలి. వ్యాధులను గుర్తించిన వెంటనే పశువైద్యుల సలహామేరకు తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని తెలియజేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య.

జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు.  ఎండాకాలం పోయింది. వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందార్లు అత్యంత  జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా  చిటుక రోగం, నీలి నాలుక,  గాలికుంటు వ్యాధి, పిపిఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి, ముందుజాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్రనష్టం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య.

ముఖ్యంగా జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే  వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్థకమైన ఆహారం అందుబాటులో వుంచితే, వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెంది పెరిగి, ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే వ్యాధుల వచ్చాయని గమనించిన వెంటనే స్థానికంగా ఉండే పశువైద్యాధికారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది.

వర్షాకాలంలో జీవాల పెంపకం దారులు  నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్ధికంగా ఎంతో నష్టం కలుగుతుంది. వ్యాధులను గుర్తించన వెంటనే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు