Tobacco Leaf Picking : పొగాకు ఆకులను దండకుట్టే మిషన్ తో తీరిన కూలీల సమస్య !

అయితే  పొగాకును సాగుచేయడం ఒకెత్తయితే.. ఆకులను దండలుగా కట్టడం మరో ఎత్తు.  ఒక్కో ఆకును కలిపి కుట్టాలి. ఇందుకు కూలీల అవసరం కూడా ఎక్కువ. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది. ఈ పనికి ఎవరూ రావడం లేదు. సమయానికి దండకట్టి, ఆరబెట్టకపోతే ఆకులు చెడిపోతాయి.

Tobacco Leaf Picking : పొగాకు ఆకులను దండకుట్టే మిషన్ తో తీరిన కూలీల సమస్య !

Tobacco Leaf Picking Mission

Tobacco Leaf Picking : పొగాకును సాగుచేయడం ఒకెత్తయితే.. ఆకులను దండలుగా కట్టడం మరో ఎత్తు.  ఒక్కో ఆకును కలిపి కుట్టాలి. ఇందుకు కూలీల అవసరం కూడా ఎక్కువ. సమయమూ ఎక్కువే పడుతుంది. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది. ఈ పనికి ఎవరూ రావడం లేదు. సమయానికి దండకట్టి, ఆరబెట్టకపోతే ఆకులు చెడిపోతాయి. అయితే ఇప్పుడు ఆసమస్య లేదు. దండకట్టె మిషన్ వచ్చింది. ఇక నుండి పొగాకు రైతుల కష్టం కొంత వరకు తీరినట్టే..

READ ALSO : Groundnut : రబీ వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణ!

పొగాకు ఆకులు కుడుతున్న మిషన్ తో సాధారణంగా పదిమంది చేసే పని మిషన్ తో ఇద్దరే చేస్తున్నారు.  ప్రకాశం జిల్లా,  నాగులుప్పలపాడు మండలం మద్దిరాలముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు జట్టి వెంకటస్వామి తన పొగాకును కుట్టేందుకు ఈ యంత్రాన్ని తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పండే పంటల్లో పొగాకు ఒకటి. ఇందులో అనేక రకాల పొగాకు ఉంది. సాధారణంగా మార్కెట్ లో వర్జీనియా పొగాకు అధిక ధర పలుకుతుంటుంది. అందుకే చాలా మంది రైతులు ఈ రకాన్నే సాగుచేస్తుంటారు. అయితే రైతు వెంకటస్వామి బర్లీ రకం పొగాకును 30 ఎకరాల్లో సాగుచేశారు.

READ ALSO : Tobacco Worm : చలికాలంలో పంటలను ఆశించే పొగాకు లద్దె పురుగు, నివారణ మార్గాలు!

అయితే  పొగాకును సాగుచేయడం ఒకెత్తయితే.. ఆకులను దండలుగా కట్టడం మరో ఎత్తు.  ఒక్కో ఆకును కలిపి కుట్టాలి. ఇందుకు కూలీల అవసరం కూడా ఎక్కువ. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది. ఈ పనికి ఎవరూ రావడం లేదు. సమయానికి దండకట్టి, ఆరబెట్టకపోతే ఆకులు చెడిపోతాయి. ఇన్నాళ్ల పడ్డ శ్రమ వృథా అవుతుంది. ఈ కష్టాలను అధిగమించేందుకు పొగాకు కంపెనీలు దండ కట్టే యంత్రాలను తీసుకొచ్చాయి. ఈ రైతుకు అందించారు.

READ ALSO : Tobacco Farming: పొగాకు సాగుతో నాలుగింతల లాభం

యంత్రం కన్వేయర్‌ బెల్టుపై రెండేసి ఆకులను పేర్చితే.. వాటి ఈనెలను దారంతో ముడేస్తూ దండగా చేస్తోంది. ఒక్కో యంత్రం రోజుకు 150 దండలు కడుతోంది. గతంలో అదే ఒక మనిషి ఒక్కో ఆకును పెద్ద దబ్బనంతో దండగా కుట్టి కేవలం 15 మాత్రమే కట్టగలడు. ఈ యంత్రంతో కొంత కూలీల సమస్య తీరినా.. కొద్దిపాటి మరమ్మత్తులు చేస్తే.. అద్భుతంగా ఉంటుందని రైతు చెబుతున్నారు.