Varieties of Paddy : ముంపును తట్టుకునే నూతన వరి రకం
ఈ నూతన వరి వంగడం ఎం.టి.యు- పన్నెండు ముప్పైరెండు రకం . మారుటేరు వరిపరిశోధనా స్థానం రూపొందించిన ఈ వరి రకాన్ని గత మూడేళ్లుగా చిరుసంచుల ప్రదర్శన పూర్తిచేసుకుంది.

Varieties of Paddy
Varieties of Paddy : వరి సాగులో ఏటా అనేక కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తుండటంతో , రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. సాగులో సమస్యలకు పరిష్కారం చూపుతూ, అధికోత్పత్తికి మార్గం సుగమం చేస్తున్న, నూతన రకాల సాగు పట్ల, రైతులు మక్కువ పెంచుకుంటున్నారు. ప్రస్థుతం ఎకరాకు 40 బస్తాల దిగుబడి రావటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది.
అయితే ముంపు ప్రాంతాలకు అనువైన రకాలు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు మరో నూతన రకం అందుబాటులోకి వచ్చింది. మారుటేరు పరిశోధనా స్థానం నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రకం పొడవైన కంకులతో ఆశాజనకంగా పెరుగుతుంది.
READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు
ఈ నూతన వరి వంగడం ఎం.టి.యు- పన్నెండు ముప్పైరెండు రకం . మారుటేరు వరిపరిశోధనా స్థానం రూపొందించిన ఈ వరి రకాన్ని గత మూడేళ్లుగా చిరుసంచుల ప్రదర్శన పూర్తిచేసుకుంది.
ముంపును తట్టుకునే ఈ రకం పైరు తక్కువ ఎత్తు పెరిగి, సన్నగింజ సైజుతో ఉంటుంది. ఎంటియు 1075 తో స్వర్ణ సబ్ 1 ను కలిపి రూపొందించిన ఈ వంగడంలో బియ్యం శాతం అధికంగా ఉంటుంది. అలాగే చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుని మిగతా రకాలకు దీటుగా దిగుబడినిస్తోంది.
READ ALSO : Prevention Of Pests : వరిలో చీడపీడల నివారణ, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు !
ఎం.టి.యు- పన్నెండు ముప్పైరెండు రకం గుణగణాలేంటో పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. టి. శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం… పూర్తి సమాచారం కోసం క్రింది వీడియోపై క్లిక్ చేయండి.