Vegetable Cultivation : పెరటితోటలతో ఏడాది పొడవునా కూరగాయల లభ్యత

రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుప్రక్కల ప్రజలకు ఇస్తూ.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పెరటితోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు. ఇంటి ఆవరణలో తోటను పెంచటం వల్ల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యమూ సంపాదించుకోవచ్చు.

Vegetable Cultivation : పెరటి వైద్యం పనికిరాదంటారు. కానీ పెరటి తోటలు మాత్రం బాగానే పనికొస్తాయి. పెరట్లో కాసిన కూరగాయలను అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే వాటి రుచే వేరు. అప్పుడే పూసిన పూవుల వాసన ముక్కుకు తగలగానే మనసు గాల్లో తేలిపోతుంది. తోటల పెంపకానికి పడే శ్రమ కూడా వృధా కాదు. శరీరాన్ని ఫిట్ గా ఉండేందుకు, ఒత్తిడి తగ్గేందుకూ తోడ్పడుతుంది. అందుకే కృష్ణా జిల్లాకు చెందిన ఓ కుటుంబం పెరట్లో పలు రకాల కూరగాయలు ప్రకృతి విధానంలో పండిస్తూ.. ఆరోగ్యం కాపాడుకోవటమే కాక డబ్బును ఆదా చేసుకుంటున్నారు.

READ ALSO : Vegetables : స్కూలే తోట.. విద్యార్థులే రైతులు.. కూరగాయలు పండిస్తున్న విద్యార్థులు

మనం తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధఆరపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషదమన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు, పురుగు మందుల వినియోగంతో పంటలు విషతుల్యమై అనారోగ్యానికి దారితీస్తున్నాయి. దీంతో సంపాదనలో అధికమొత్తం కుటుంబ వైద్యఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. నేటి జీవన పరిస్థితుల్లో ఆరోగ్యం సన్నగిల్లితే కుటుంబ పోషణ కష్టమవుతుంది.

READ ALSO : Vegetable cultivation : కూరగాయల సాగు.. లాభాలు బాగు

వీటిన్నీటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఉన్న కొద్ది పాటి భూమిలో పెరటితోటలు పెంచుతుండగా.. స్థలంలేని వారు మిద్దెపైనే కూరగాయలు పండించుకొని తింటున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, ఓండ్రంపాడు గ్రామానికి చెందిన చెన్నా వీరరాఘవ వరప్రసాద్ కుటుంబం.. తనకున్న 6సెంట్ల భూమిలో పలు రకాల కూరగాయలను పండిస్తూ… తింటున్నారు.

READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

వీటికి ఎలాంటి రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుప్రక్కల ప్రజలకు ఇస్తూ.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పెరటితోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు. ఇంటి ఆవరణలో తోటను పెంచటం వల్ల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యమూ సంపాదించుకోవచ్చు. అంతకుమించి పెరటితోట పెంపకం వల్ల కూరగాయల ఖర్చును ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు కిచెన్ వ్యర్థాలను కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ గా మార్చి తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు