Vegetables : స్కూలే తోట.. విద్యార్థులే రైతులు.. కూరగాయలు పండిస్తున్న విద్యార్థులు

అయిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు మొత్తం 632 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాల మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతేడాది రెండెకరాల స్థలాన్ని చదును చేసి కూరగాయలు, ఆకుకూరలతోపాటు పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు.

Vegetables : స్కూలే తోట.. విద్యార్థులే రైతులు.. కూరగాయలు పండిస్తున్న విద్యార్థులు

Vegetables in School

Vegetables : అదో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల. 500 మందికి పైగా పిల్లలు.. విద్యార్థులు అంటే చదువేనా… కాదు.. వారికీ మానసిక ప్రశాంతంత కావాలి. అందుకోసం ఆ స్కూల్ నిర్వాహకులు.. వ్యవసాయాన్ని నేర్పుతున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణంలో ప్రకృతి విధానంలో రకరకాల పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు.. మిగిలిన కూరగాయలు అమ్మి.. పాఠశాల అభివృద్ధికి పాటుపడుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత

రోజులు మారాయి.. కెరీర్‌ ఓరియెంట్‌ చదువులు.. పట్టణ జీవనం నిత్యం ఉరుకులు పరుగులు.. చిన్నారులకు గ్రామాలతో పరిచయం తగ్గిపోవడం.. వంటి సమస్యలతో వ్యవసాయానికి దూరమవుతున్నారు.. చాలా మంది మన ప్రాంతంలో పండే పంటలు కూడా గుర్తించలేకపోతున్నారు.. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సేద్యంపై చైతన్యం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పాఠశాల ఆవరణలో కూరగాయల సాగుచేస్తూ.. విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు.

గురుకుల పాఠశాల విద్యార్థులు భోజనానికి కావాల్సిన సేంద్రియ కూరగాయలను, పండ్లను సొంతంగా పండించుకుంటున్నారు. అయిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు మొత్తం 632 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాల మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతేడాది రెండెకరాల స్థలాన్ని చదును చేసి కూరగాయలు, ఆకుకూరలతోపాటు పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు.  వీటితో పాటు మామిడి, జామ, నిమ్మ, సపోట, పూల మొక్కలను పెంచుతున్నారు. విద్యార్థులు వినియోగించగా.. మిగిలిన కూరగాయలను పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కొనుగోలు చేస్తుండగా, సదరు నగదుతో పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

READ ALSO : Sri Gandham Trees : ఆకుపచ్చని భవిష్య నిధిగా శ్రీగంధం, ఆస్ట్రేలియన్ టేకు సాగు

చదువులో అంతర్భాగంగా విద్యార్థులతో సాగుబడి చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. కలం పట్టే చేతులన్నీ ఏకమై కర్షకుల్లా కష్టించి పంటలు పండిస్తున్నారు. రసాయనాలతో పని లేకుండా వివిధ సహజమైన ఎరువులను తయారు చేయించి మొక్కలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు ప్రకృతిలో దొరికే ఆకులతో పలు కషాయాలను తయారు చేసి పిచికారి చేస్తున్నారు. దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు.