Sri Gandham Trees : ఆకుపచ్చని భవిష్య నిధిగా శ్రీగంధం, ఆస్ట్రేలియన్ టేకు సాగు

శ్రీగంధం కోతకు రావాలంటే దాదాపు 18 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుంది.  మలబారు వేప, ఆస్ట్రేలియన్ టేకును 7 ఏళ్లకు కోతకు వస్తాయి. మొదటి 3 ఏళ్లపాటు అంతర పంటలుగా పప్పుదినుసులు, కూరగయాలు సాగుచేసి ఆదాయం పొందారు. మరో రెండేళ్లలో మలబారు వేప చేతికొస్తుందని రైతు చెబుతున్నారు.

Sri Gandham Trees : ఆకుపచ్చని భవిష్య నిధిగా శ్రీగంధం, ఆస్ట్రేలియన్ టేకు సాగు

Sri Gandham Trees

Sri Gandham Trees : పంట దిగుబడి ఎంత తొందరగా చేతికొస్తే, రైతుకు అంత ప్రయోజనం! అయితే, ఆరుగాలం చెమటోడ్చినా, కాలం కలసి రాకనో, చేతికొచ్చిన దిగుబడికి ధర గిట్టుబాటు కాకనో.. రైతన్న పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగానే మిగిలింది. కొద్ది నెలల్లో ఆదాయాన్నిచ్చే ఆహార, వాణిజ్య పంటల సాగుపైనే పూర్తిగా ఆధారపడటమే , అన్నదాతల దుస్థితికి ఒకానొక ముఖ్యకారణం. ఈ వాస్తవాన్ని గ్రహించిన కొందరు రైతులు.. ఏటేటా కొన్నేళ్లపాటు ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి సారిస్తూ.. కొంత మేరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతున్నారు.

READ ALSO : Sandalwood Cultivation : శ్రీగంధం సాగుతో… అధిక అదాయం

ఒకపక్క వ్యవసాయాన్ని నామోషీగా భావించి.. 10 వేల జీతానికే పల్లెలను వదిలి , పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత.. మరోపక్క ఉన్నత చదువులు చదివి, మంచి వేతనం వస్తున్నా.. అందులో తృప్తిలేక, పల్లెబాట పడుతున్నారు మరికొందరు. పచ్చని పంట పొలాల్లో.. వ్యవసాయం చేస్తూ.. సంతృప్తి చెందుతున్న వారిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు రాజు ఒకరు. ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం, కాండిపల్లి గ్రామానికి చెందిన యువరైతు రాథోడ్ రాజు  తనకున్న వ్యవసాయ భూమిలో దీర్ఘకాలిక కలప మొక్కలైన శ్రీగంధం, మలబారు వేప, ఆస్ట్రేలియ టేకును సాగుచేస్తున్నారు.

నాటిన పది, పదిహేనేళ్ల తర్వాత వరకు తీసేసే పండ్ల తోటలతో పాటుగా.. 10, 20, 25 ఏళ్లకు ఒకే సారి కోతకొచ్చే ఖరీదైన కలప చెట్లను సాగు చేస్తున్న రైతన్నలు బహు కొద్ది మంది మాత్రమే. దూరదృష్టితో వెలుగుబాటన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నారు.  తనకున్న పొలంలో దీర్ఘకాలిక కలప వృక్షాలైన శ్రీగంధం, మలబారు వేప, ఆస్ట్రేలియన్ టేకు సాగుచేస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : Timber Plantation : కలప మొక్కల పెంపకంతో అధిక అదాయం

యువరైతు రాజు ఎంబిఏ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఎల్.ఎల్.బి చదువుతున్నారు. ఒక ఐటి కంపెనీని ఏర్పాటుచేసి పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే వ్యవసాయం పై ఉన్న మక్కువతో సొంత ఊరిలో తనకున్న వ్యవసాయ భూమిలో 4 ఎకరాల్లో దీర్ఘకాలిక కలప పంటైన శ్రీగంధంను 3 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. మరో ఎకరంలో మలబారు వేప, ఆస్ట్రేలియన్ టేకు మొక్కలను పెంచుతున్నారు.

శ్రీగంధం కోతకు రావాలంటే దాదాపు 18 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుంది.  మలబారు వేప, ఆస్ట్రేలియన్ టేకును 7 ఏళ్లకు కోతకు వస్తాయి. మొదటి 3 ఏళ్లపాటు అంతర పంటలుగా పప్పుదినుసులు, కూరగయాలు సాగుచేసి ఆదాయం పొందారు. మరో రెండేళ్లలో మలబారు వేప చేతికొస్తుందని రైతు చెబుతున్నారు. చదువుకున్న యువత వ్యవసాయంలోకి వచ్చి.. ఆధునిక పద్ధతులు పాటించి సాగును లాభసాటి మార్చవచ్చు. ఈ రైతు  అందరిలా సంప్రదాయ పంటలు కాకుండా దీర్ఘకాలం చేతికొచ్చే కలప మొక్కలను పెంచుతూ.. మరో వైపు ఉద్యోగం చేసుకుంటూ.. పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

READ ALSO : Agarwood : చెట్లకు సెలైన్ లో విషం పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతులు !

ఒక పంటకు కాకపోయినా, మరో పంటకైనా మంచి ధర పలుకుతుందనేది ఆశతో   శ్రీగంధం , మలబారు వేప, ఆస్ట్రేలియన్ మొక్కలు నాటారు రైతు. ఇప్పుడు ఏపుగా పెరుగుతున్న చెట్లు. ఇప్పటికే అంతర పంటలతో ఆదాయం పొందిన రైతు, మరో రెండు మూడేళ్లలోమలబారు వేప, ఆస్ట్రేలియన్ మొక్కలపై ఆదాయం పొందుతానంటున్నారు. చదువుకున్న యువతకూడా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే, దీర్ఘకాలిక పంటలను వేస్తే.. ఇటు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, అటు ఆదాయం పోందేందుకు వీలుంటుంది.