Timber Plantation : కలప మొక్కల పెంపకంతో అధిక అదాయం

వర్షాకాలంలో వర్షం పడిన వెంటనే ఒక్కో మొక్కకు 100 గ్రాముల చొప్పున డి ఏ పి రెండు సార్లు అందించాలి. మొక్కల ఆకృతి బాగుండేలా అవసరం మేరకు కత్తిరింపులు చేపడితే చెట్లు నిటారుగా పెరిగే అవకాశం ఉంది.

Timber Plantation : కలప మొక్కల పెంపకంతో అధిక అదాయం
ad

Timber Plantation : సంప్రదాయ పంటలను సాగు చేస్తూ, స్థిరమైన ఆదాయం పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనిని నుండి బయటపడేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది రైతులు కలప చెట్ల పెంపకం దృష్టిసారిస్తున్నారు. వాణిజ్య శైలిలో ఎర్ర చందనం, శ్రీగంధం వంటి కలప జాతి చెట్ల పెంపకం తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో సమతలంగా లేని నెలల్లో, బంజరు భూముల్లో కలప మొక్కలను పెంచి ఆదాయం పొందవచ్చు.

కలప సాగుకు ముందస్తుగా ; కలప మొక్కల సాగు చేపట్టాలంటే ముందుగా ఆ నేలల్లో ఉండే ముళ్ళపొదలను అడవి మొక్కలను వేర్లతో సహా పెకలించి అనువుగా ఉన్న చోట్ల దున్నాలి. అలవిగాని ప్రాంతాలలో బుల్డోజర్ల సహాయంతో నేలను సిద్ధం చేసుకోవాలి. మొక్కలు నాటడానికి ముందు నేల భౌతిక, రసాయనిక గుణాలను భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. నేల స్వభావం ఫలితాలను అనుసరించి చెరువు మట్టిని మొక్కలు నాటే గుంతల్లో కలపాలి. దీని వల్ల భూసారం పెరుగుతుంది.

ఎంపిక చేసుకున్న భూముల్లో వ్యవసాయ శాఖ నిపుణులు సూచించిన విధంగా గుంతలు తవ్వుకోవాలి. ఎకరాకు ఎన్ని గంటలు తీయాలన్నది పెంచే మొక్క లను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి గుంత సుమారుగా ఎటుచూసినా 2 నుండి 4 మీటర్ల దూరంలో ఉండాలి పశువుల ఎరువుతో పాటు నల్ల మట్టి వేయాలి. వీలైతే వీటికి అరకిలో వేపపిండి 50 గ్రాములు మూడు శాతం లిండేన్‌ పొడి కలిపి గుంతల్ని నింపాలి. రుతువులను అనుసరించి మొక్కలను నాటాలి. మే నుండి జూన్‌ లో గుంతలు తీసుకొని జూన్‌ నుండి ఆగస్టు మాసాల మధ్యలో మొక్కలను నాటుకోవచ్చు

మొక్కలు నాటిన తరువాత 1-2 సంవత్సరాల పాటు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. నాటిన తరువాత వచ్చే మొదటి వేసవి కాలంలో 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఏడు నుంచి ఎనిమిది సార్లు అవసరాన్ని బట్టి మొక్కలకు నీరు అందించాలి దీని వలన ఎక్కువ శాతం మొక్కలు మొదటి సంవత్సరం రెండు లేదా మూడు వారాలు పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా కడవలతో నీళ్లు పోయడం లేదా పద్ధతిలో నీరు అందిస్తూ ఉండాలి. వర్షాకాలంలో వర్షం పడిన వెంటనే ఒక్కో మొక్కకు 100 గ్రాముల చొప్పున డి ఏ పి రెండు సార్లు అందించాలి. మొక్కల ఆకృతి బాగుండేలా అవసరం మేరకు కత్తిరింపులు చేపడితే చెట్లు నిటారుగా పెరిగే అవకాశం ఉంది.

సస్యరక్షణ విషయానికి వస్తే ఈ మొక్కల్లో చీడపీడల సమస్య తక్కువగానే ఉంటుంది. వేరు పురుగు సమస్య ఉన్న నేలల్లో 2 చ.మీ.కు 1 టీ చెంచా కార్బోప్యూరాన్ గుళికలు వేయడం ద్వారా వేరు పురుగును నివారించవచ్చు. ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళ మొక్కలకు ఆశించినట్లు అయితే లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ పిచికారీ చేసి తెగుళ్లను నివారించవచ్చు. పొలంలో సరైన అంతరకృషి, కలుపు నివారణ చర్యలు ఎప్పటికప్పుడు చేపడితే నాణ్యతతో కూడిన కలపను పొందేందుకు అవకాశం ఉంటుంది.