Sharwanand: దానికి కారణం నా కూతురే.. తనవల్లే ఇలా మారాను.. ఇకనుంచి నా లక్ష్యం అదే..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన టైప్ ఆఫ్ నటనతో(Sharwanand) తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు.
Hero Sharwanand made interesting comments about his daughter
Sharwanand: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన టైప్ ఆఫ్ నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా బాగుంటుంది అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా(Sharwanand) సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు అంతగా ఆడటం లేదు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తున్న సినిమా బైకర్. బైక్ రేసింగ్ కాంసెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.
Pooja Hegde: ‘తలపతి కచేరి’ సాంగ్ లో పూజ హాట్ అందాలు.. ఫోటోలు
ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన శర్వానంద్ లుక్ ఆడియన్స్ ఆశ్చర్యానికి గురించి చేసింది. చాలా సన్నబడి కనిపించదు శర్వానంద్. అసలు ఇలా ఎలా మారిపోయాడు శర్వా అంటూ సోషల్ మీడియాలో తెగ టాక్ నడిచింది. రీసెంట్ గా ఇదే విషయం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు శర్వానంద్. ఆయన ఇటీవల నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ విషయం నా కూతురు పుట్టాకే నాకు అర్థమయ్యింది. అంతకుముందు నేను ఎప్పుడు వర్కవుట్స్ చేయలేదు. కూతురు పుట్టాకే నా శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాను. ఆరోగ్యంగా ఉండటం అనే ఒక జీవన విధానం. నా కుటుంబం కోసం నేను ధృడంగా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శర్వానంద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం శర్వానంద్ బైకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ‘సమజవరగమన’ సినిమా దర్శకుడు రామ్ రబ్బరాజుతో నారి నారి నడుమ మురారి అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. ఈ రెండు సినిమాల తరువాత మాస్ దర్శకుడు సంపత్ నదితో భోగి సినిమా చేస్తున్నాడు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
