Actress : ఒకప్పుడు అందర్నీ ఏడిపించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?

ఒకప్పటి స్టార్ హీరోయిన్, తన నటనతో అందర్నీ మెప్పించిన నటి కూడా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.(Actress)

Actress : ఒకప్పుడు అందర్నీ ఏడిపించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?

Senior Actress

Updated On : November 6, 2025 / 10:05 AM IST

Actress : సీనియర్ హీరోయిన్స్ సినీ పరిశ్రమ వదిలేసిన తర్వాత పెళ్లి చేసుకొని దూరంగా సెటిల్ అయిపోతారు. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్, తన నటనతో అందర్నీ మెప్పించిన నటి కూడా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.(Actress)

ఇంతకీ ఆ నటి ఎవరో అనుకుంటున్నారా? మాతృదేవోభవ లాంటి సూపర్ హిట్ ఎమోషనల్ సినిమాతో అందర్నీ ఏడిపించిన మాధవి. ఖైదీ, బిగ్ బాస్, మరోచరిత్ర, కోతల రాయుడు, మండే గుండెలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.. ఇలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది మాధవి. చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాక తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా చాలా సినిమాలు చేసింది.

Also Read : Jyothi : నటి జ్యోతి కొడుకుని చూశారా? కొడుకుతో కలిసి కొత్తింట్లోకి..

మాధవి 1996లో రాల్ఫ్ శర్మ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయి స్థిరపడింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ సినిమాలు చేయలేదు. ఈమెకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు మాధవి.

ఇటీవల ఆమె తన ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Own House : భార్య పెద్ద సింగర్, భర్త యాక్టర్, డైరెక్టర్.. అయినా సొంతిల్లు లేదట.. నేను ఇస్తానని మాట ఇచ్చిన నిర్మాత..

తన ముగ్గురు కూతుళ్లతో ఒకప్పటి హీరోయిన్ మాధవి..

Senior Actress Mathrudevobhava Madhavi Recent Photos goes Viral