Gautam Gambhir : ‘బాబు.. ఇటు రా.. నీతో కాస్త మాట్లాడాలి..’ ప్రాక్టీస్‌ను ఆపి మరి గిల్‌తో సీరియస్‌గా మాట్లాడిన గంభీర్..
ప్రాక్టీస్ సెషన్ సమయంలో శుభ్‌మన్ గిల్‌తో హెడ్ కోచ్ గౌంభీర్ (Gautam Gambhir) చాలా సేపు మాట్లాడాడు.
Gambhir pulled Gill out for a chat as he was walking with the team for some practice drills
Gautam Gambhir : దాదాపు ఏడాది తరువాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్ ఈ ఫార్మాట్‌లో పెద్దగా రాణించడం లేదు. ఆసియాకప్ 2025లో పునరాగమనం చేసిన గిల్ ఇప్పటి 10 ఇన్నింగ్స్‌లు ఆడాడు 23 సగటు, 146 స్ట్రైక్‌రేటుతో కేవలం 184 పరుగులు మాత్రమే సాధించాడు. అత్యధిక స్కోరు 47. దీంతో అతడిని తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
గురువారం గోల్డ్‌కోస్ట్ లోని కరారా ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగో టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బుధవారం భారత జట్టు గోల్డ్ కోస్ట్ చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఈ సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది.
Gautam Gambhir and Shubman Gill were seen having a long intense discussion during the practice session.
The chat possibly about Gill’s T20 form, reflected his eagerness to improve and learn. With his work ethic and hunger to bounce back Gill looks determined to regain top form… pic.twitter.com/mJyl8GGmo5
— GillTheWill (@GillTheWill77) November 5, 2025
సహచర ఆటగాళ్లతో కలిసి శుభ్‌మన్ గిల్ డ్రిల్‌లో పాల్గొన్నాడు. ఈ సమయంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) అతడిని పక్కకు పిలిచాడు. వీరిద్దరి చాలా సేపు చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి టీ20 ఫామ్ గురించి చర్చించుకుని ఉంటారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో గిల్ వరుసగా 37*, 5, 15 పరుగులు సాధించాడు.
సంజూ శాంసన్‌కు తప్పించి మరీ..
ప్రస్తుతం వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ భవిష్యత్తులో టీ20 ఫార్మాట్‌లోనూ నాయకత్వ బాధ్యతలు అందుకునే రేసులో అందరి కన్నా ముందు ఉన్నాడు. అయితే.. టీ20 ఫార్మాట్‌లో అతడు పరుగులు చేయడంలో ఇబ్బందులు పడుతున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు ఓపెనింగ్ ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్న సంజూశాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి మరీ టీమ్ మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా ఆడిస్తోంది.
ఈ నేపథ్యంలో నాలుగో టీ20 మ్యాచ్‌లోనైనా అతడు ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. నాలుగో మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆధిక్యంలోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు హోరాహోరీగా పోరాడుతాయనడంలో సందేహం లేదు.
