Vegetable cultivation : కూరగాయల సాగు.. లాభాలు బాగు

ఏ ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు కూడా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలనుకున్నారు. మార్కెట్ లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉండే కూరగాయల పంటల సాగును ఎంచుకొని ప్రతి రబీలో సాగుచేస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు.  అయితే స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

Vegetable cultivation : కూరగాయల సాగు.. లాభాలు బాగు

Vegetable cultivation

Vegetable cultivation : వ్యవసాయంలో.. మూస పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతున్నారు. కాలానికి అనుగుణంగా సంపదనెరిగి సాగు చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండి, తక్కువ భూమిలో అధిక దిగుబడులను ఇచ్చే పంటలను ఎంచుకుంటూ.. శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఖరీఫ్ లో వరిసాగుచేస్తూ.. రబీలో పలు రకాల కూరగాయల సాగు చేపట్టి  మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

READ ALSO : Cultivation Of Vegetables : వేసవిలో కూరగాయల సాగు, రైతులు పాటించాల్సిన మెళుకువలు !

కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, కొండపావులూరు గ్రామాంలో ఉంది. దీన్ని సాగుచేస్తున్న రైతు పేరు సోములు. 3 ఎకరాల వ్యవసాయ భూమిలో కూరగాయల సాగుచేస్తున్నారు. ఖరీఫ్ లో వరి సాగుచేస్తున్న ఈ రైతు.. గతంలో రెండవ పంటగా మినుమును సాగుచేసేవారు. అయితే ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని సార్లు పంటలు దెబ్బతింటే.. మంచి దిగుబడి వచ్చినా మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాక నష్టాలను చవిచూసేవారు.

READ ALSO : Vaccinations For Animals : పశువులలో ముందస్తుగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

ఏ ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు కూడా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలనుకున్నారు. మార్కెట్ లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉండే కూరగాయల పంటల సాగును ఎంచుకొని ప్రతి రబీలో సాగుచేస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు.  అయితే స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతు.

READ ALSO : Sorghum Cultivation : జొన్న సాగు.. బహు బాగు

ఇతరులకు భిన్నంగా రైతు సోములు అనేక రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం పొందుతున్నాడు. మార్కెట్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈయన అందుకు తగ్గట్టుగానే కూరగాయ రకాల ఎంపిక, సాగు సమయాన్ని అంచనా వేసి ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తూ..  మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. సంప్రదాయ పంటలు,వాణిజ్య పంటలు వేసి చేతులు కాలచ్చుకునేకంటే, నిత్యం మార్కెట్ ఉండే కూరగాయలు సాగుచేస్తున్న ఈ రైతును ఆదర్శంగా తీసుకుని, సాటిరైతులు సాగులో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.