Vaccinations For Animals : పశువులలో ముందస్తుగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

పాడి పశువులను పెంచేవారు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పశువైద్యాధికారులు. ఎప్పటికప్పుడు జబ్బులను గుర్తిస్తూ అవసరమైన చికిత్స, టీకాలు వేయించాలంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో గాలికుంటు వ్యాధి ఆశిస్తుంది.

Vaccinations For Animals : పశువులలో ముందస్తుగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

Early Vaccinations for animals

Vaccinations For Animals : మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోన్న ప్రస్తుత పరిస్థితిల్లో గ్రామీణ మహిళలకు పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా మారింది. పశువు ఆరోగ్యంగా ఉంటేనే పాల దిగుబడి బాగా ఉంటుంది. పాల దిగుబడి ఆశాజనకంగా ఉంటేనే పాడి రైతుకు మేలు. అలాకాకుండా పశువు అనారోగ్యం బారిన పడితే పోషణ వ్యయం పెరిగి ఆర్థికంగా నష్టపోతాడు.

READ ALSO : Inflammation In Cattle : పశువుల్లో పొదుగువాపును అరికట్టే చర్యలు

పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గాలికుంటు తీవ్రమైనది. దీని నివారణ కోసం జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత టీకాలు వేస్తున్నారు. దీంతో పాటు వేసవి కాలంలో చేపట్టాల్సిన పశు సంవరక్షణా చర్యలపై విజయనగరం జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా…. మహిళలు పశువులను పెంచుతూ, తమ సొంతకాళ్లపై నిలబడి ఆర్థికంగా స్వావలంబన పొందుతున్నారు . పాల ఉత్పత్తితో పాటు పశువుల పేడ, గెత్తంతో అదనపు సంపాదిస్తున్నారు. తొలుత ఒకటి రెండు పశువులతో ప్రారంభించిన మహిళలు క్రమంగా వాటిని అభివృద్ధి చేసుకుంటూ, చిన్నపాటి డెయిరీగా తీర్చిదిద్దుతున్నారు. పాడితో తాము ఆర్థికంగా స్థిరపడటంతో పాటు కుటంబానికి భరోసాగా ఉంటున్నామని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Quail Bird Farming : కౌజు పిట్టలకు మార్కెట్ లో మంచి డిమాండ్.. నిరుద్యోగులకు ఉపాధినిస్తున్న పెంపకం

పాడి పశువులను పెంచేవారు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పశువైద్యాధికారులు. ఎప్పటికప్పుడు జబ్బులను గుర్తిస్తూ అవసరమైన చికిత్స, టీకాలు వేయించాలంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో గాలికుంటు వ్యాధి ఆశిస్తుంది.

అందుకే జిల్లాలోని అన్ని పశువైద్య శాలల్లో వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి  టీకాలు వేస్తున్నారు. టీకా కోసం రైతు భరోసా కేంద్రాల్లోని పశువైద్య సహాయకులను సంప్రదించాలి . టీకా వేసిన వాటి గుర్తింపునకు విధిగా చెవిపోగు వేయించుకోవాలని సూచిస్తున్నారు.

READ ALSO : Lumpy Disease : పశువుల్లో మరణాలకు దారి తీస్తున్న లంపి స్కిన్ డిసీజ్ !

వేసవి కాలంలో పశు సంవరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పశువైద్యాధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వీటితో పాటు సబ్సిడీ కింద పశుగ్రాస విత్తనాలు, దాణా అందిస్తున్నారు. జిల్లాలోని పాడిరైతులు తమపశువులకు ఆరోగ్య సమస్యలొస్తే 1962 టోల్ ప్రీ నంబర్ ను సంప్రదించాలని చెబుతున్నారు.