Lumpy Disease : పశువుల్లో మరణాలకు దారి తీస్తున్న లంపి స్కిన్ డిసీజ్ !

వ్యాధి సోకిన పశువు యొక్క నోరు, నాసికాకుహరం, కంటి నుండి కారే స్రావాలలో వైరస్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ స్రావాలు పశువుల మేత మరియు నీటి తొట్టెలను వైరసుతో కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి సోకిన ఆబోతు వీర్యంలో కూడా వైరస్‌ విసర్జించబడుతుంది.

Lumpy Disease : పశువుల్లో మరణాలకు దారి తీస్తున్న లంపి స్కిన్ డిసీజ్ !

Lumpy disease leading to death in cattle!

Lumpy Disease : లంపి స్కిన్ డిసీజ్ కేసులు పెరుగుతున్న కొద్దీ పశువుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ ఇదొక అంటువ్యాధిలా పశువుల్లో ప్రభలుతుంది. ఇప్పటికే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా 57,000 పశువుల మరణాలకు కారణమైంది. ఇప్పటి వరకు 15.21 లక్షల పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఢిల్లీతో సహా కనీసం ఏడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి వచ్చిన జంతువులను, వ్యాధి సోకని జంతువుల నుండి వేరు చేయడానికి,వ్యాధి వ్యాప్తిని ఆపడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సిఫార్సు చేసింది.

ఇప్పటికే రాజస్థాన్ మరియు గుజరాత్‌లలో, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, సమర్థవంతమైన నివారణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ వైరల్ వ్యాధి కారణంగా, ఈ రెండు రాష్ట్రాల్లో ఆగస్టులోనే సుమారు 3,000 పశువులు చనిపోయాయి.

లంపి స్కిన్ డిసీజ్ కు కారణాలు ఏమిటి?

లంపి స్కిన్ డిసీజ్ (LSD) దీనినే ముద్ద చర్మపు వ్యాధి అని కూడా పిలుస్తున్నారు. లంపి స్కిన్ డిసీజ్ అనేది కాప్రిపాక్స్ వైరస్ వల్ల పశువులు మరియు గేదెలకు వచ్చే వైరల్ వ్యాధి. ఇది కొన్ని జాతుల ఈగలు, దోమలు లేదా పేల వంటి రక్తాన్ని తాగే కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం మరియు చర్మంపై బుడిపెలుకు కారణమవుతుంది. చివరకు మరణానికి కూడా దారి తీస్తుంది. లంపి స్కిన్ డిసీజ్‌కి చికిత్స లేదు. ఒక ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పశువులు సోకిన వాహకాలు ఈగలు మొదలైనవి దాడి చేయకుండా ఆపడం కష్టం.

వ్యాధి సోకిన పశువు యొక్క నోరు, నాసికాకుహరం, కంటి నుండి కారే స్రావాలలో వైరస్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ స్రావాలు పశువుల మేత మరియు నీటి తొట్టెలను వైరసుతో కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి సోకిన ఆబోతు వీర్యంలో కూడా వైరస్‌ విసర్జించబడుతుంది. కావున ఈ వ్యాధి సహజ సంపర్కం, కృత్రిమ గర్భధారణ ద్వారా కూడా ఆడ పశువులకు వచ్చే అవకాశం ఉంది. పాలు త్రాగే దూడలకు తల్లి పాల ద్వారా లేదా పొదుగు పై ఉన్న చర్మం పొక్కుల ద్వారా వ్యాధి ఇతర పశువులకు వచ్చే ప్రమాదం ఉంటుంది.

వ్యాప్తిని మనం ఎలా నిరోధించగలం?

ముద్ద చర్మ వ్యాధి నియంత్రణ ,నివారణ నాలుగు వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. లంపి స్కిన్ డిసీజ్‌కి వ్యతిరేకంగా ఇప్పటి వరకు కనీసం 97 లక్షల డోస్‌ల టీకాలు పశువులకు ఇచ్చారు. దాదాపు 80,000 పశువులు వైరల్ వ్యాధి నుండి కోలుకున్నాయి. వైరల్ వ్యాధితో పోరాడడంలో పాడి రైతులు, పశువుల కాపరులకు సహాయం చేయడానికి 1962లో టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ ను అధికారులు అందుబాటులో ఉంచారు.

ఈ వ్యాధి జూనోటిక్ కానందున జంతువుల నుండి మనుషులకు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల పశువుల నుండి సేకరించిన పాల ఉత్పత్తులపై దాని ప్రభావాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు.

పాల ఉత్పత్తులు తీసుకోవడం సురక్షితమేనా?

వ్యాధి సోకిన పశువుల పాలను తీసుకోవటంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మరిగించిన పాలను తిన్నా, తీసుకోకపోయినా, పాల నాణ్యతలో తేడా ఉండదు. పశువులకు సకాలంలో టీకాలు వేయించినట్లయితే, పాల ఉత్పత్తిపై వ్యాధి ప్రభావాలను నిలిపివేయవచ్చు. టీకాలు వేయకుండా పశువులు మొదటిసారిగా వ్యాధిని సంక్రమిస్తే, పాల ఉత్పత్తి 40-50% తగ్గుతుంది. భారతదేశంలో మొదటిసారిగాలంపి స్కిన్ డిసీజ్ 2020 సెప్టెంబర్‌లో కనుగొన్నారు. ప్రస్తుత ఉప్పెనకు ముందు, మహారాష్ట్రలో వైరస్ యొక్క మూలాలను గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలుగా గుజరాత్‌లో కేసులు నమోదు చేయబడ్డాయి, అయితే ఇప్పుడు ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుండటం అందరిని ఆందోళన కలిగిస్తుంది.

పశువుల్లో వ్యాధి లక్షణాలు ;

ఈ వైరస్‌ పశువు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించటానికి 5 రోజుల నుండి 10 రోజులు పడుతుంది. ఈ వ్యాధి సోకినపుడు 104-105 డిగ్రీల ఫారెన్హీట్‌ వరకు జ్వరం, కళ్ళ నుండి, ముక్కు నుండి నీరు కారడం, నోటి నుండి చొంగ కారటం ఈ వ్యాధి మొదటి లక్షణం. తరువాత చర్మం కింద, నోటి చిగురు, ముట్టె మీద, ముక్కుదూలం మీద, కణితులు,బుడిపెలు వంటివి ఏర్పడతాయి. దీనితో పాటు మెడ మరియు తొడల దగ్గర లింఫ్‌ గ్రంధులు వాచి, పొదుగు, రొమ్ము భాగం, కీళ్లలో నీరు చేరి పశువు నీరంసంగా మారుతుంది.

ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే పాడి రైతులు సమీపంలోని పశువైద్యులను సంప్రదించటం మంచిది. తద్వారా సకాలంలో పశువులకు చికిత్సను అందించటం ద్వారా అవి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. లక్షణాలు గుర్తించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యచికిత్స అందిస్తే పశువు త్వరితగతిన కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.