Sorghum Cultivation : జొన్న సాగు.. బహు బాగు

సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాలవారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతోపాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్‌లో జొన్నలకు గిరాకీ పెరిగింది.

Sorghum Cultivation : జొన్న సాగు.. బహు బాగు

Sorghum Cultivation

Sorghum Cultivation : ఒకప్పుడు సన్న బియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవడానికి జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడది తారుమారైంది. సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాలవారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతోపాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్‌లో జొన్నలకు గిరాకీ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకొని కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కొన్నేళ్లుగా రెండో పంటగా జొన్నలను సాగుచేస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : Maize Farming : రైతుకు మంచి అదాయవనరుగా మొక్కజొన్నసాగు !

రబీ జొన్న సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా దిగుబడులపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కేవలం భూమిలోని తేమ, మంచు ఆధారంగా సాగయ్యే పంట కావడంతో కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, ముస్తాబాద్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. గతంలో రెండో పంటగా మినుమును సాగుచేసేవారు. అయితే చీడపీడల ఉధృతి పెరిగిపోవడం.. వాటి నివారణకు అధిక ఖర్చులు చేయడం.. ఇటు దిగుబడులు కూడా తగ్గుతూ వచ్చాయి.

READ ALSO : Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !

మరోవైపు కూలీల సమస్య కూడా అధికమవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగుచేశారు. అయితే ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం.. అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఏడుఎనిమిదేళ్లుగా జొన్నసాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ నీటితడులతోనే పంట చేతికి వస్తోంది. అంతే కాదు ఈ పంటకు కూలీల సమస్య కూడా లేకపోవడంతో రైతులు జొన్నసాగే మేలంటున్నారు.

READ ALSO : Jowar cultivation : జొన్నసాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ..

ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే  ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాధారణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్ధాయిలో పండించడానికి రైతాంగం మొగ్గుచూపుతున్నారు.