Chili Cultivation : మిరప సాగులో కలుపు యాజమాన్య పద్దతులు!

మిరపలో తఫతఫాలుగా నీరు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి, నీరు కట్టిన ప్రతీసారి కూడా కలుపు మొలిచే అవకాశం ఉంటుంది. పైరులో సాళ్ళుకమ్ముకున్న తరువాత కలుపు వలన పెద్దగా సమస్య లేనప్పటికిని, పాయలాకువంటి కలుపు ఆశించినపుడు పైరు నీడలోకూడ పెరుగుతూ నష్టం కలుగజేన్తుంది.

Chili Cultivation : మిరప సాగులో కలుపు యాజమాన్య పద్దతులు!

chili cultivation

Updated On : December 30, 2022 / 6:17 PM IST

Chili Cultivation : వాణిజ్య పంటల సాగులో మిరపకూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా మిరప పంటను ప్రతిఏటా సాగు చేస్తుంటారు. మిరప దీర్ఘకాలిక పంట కావటంతో నీటి అవసరత ఎక్కువగా ఉంటుంది. ఎరువుల వినియోగం అధికమే. ఈ నేపధ్యంలో కలుపు రావటానికి అవకాశాలు ఉంటాయి. కలుపు వల్ల మిరప పంటకు నష్టం వాటిల్ల కుండా ఉండాలంటే రైతులు సరైన యాజమాన్య పద్దతులు పాటించాల్సిన అవసరం ఉంది.

నేల తయారి:

ఏప్రిల్‌ – మే నెలలలో కురిసే వర్షాలకు ట్రాక్టరుతో నడిచే నాగలితో 8-10 అంగుళాల లోతువరకు దుక్కి చేసుకోవాలి. ఆ తరువాత తొలకరి వర్షాలకు 3-4 సార్లు గొర్రు, గుంటకలతో నేల బాగా తయారు చేసుకుంటే మిరప పైరులో కలుపు రాకుండా నివారించుకోవచ్చు.

అంతర సేద్యం :

మిరప సాళ్ళ మధ్య, సాళ్ళలో మొక్కల మధ్య దూరం అధికం. కాబట్టి గొర్రు, గుంటకలతో సేద్యం చేయటానికి అవకాశం ఉంటుంది. మిరప నాటిన 20-25 రోజులకు మొదలు పెట్టి, ఆ తరువాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి చొప్పున సాళ్ళ మధ్యన ఖాళీ కలిసిపోయేంత వరకు వరకు అంతర సేద్యం చేయాలి. నాటువేసిన తోటలలో సాళ్ళ మధ్యన, మొక్కల మధ్యన దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంతర సేద్యం రెండువైపుల చేయవచ్చు. అంతర సేద్యం చేసిన తరువాత పొలంలో మిగిలిపోయిన కలుపు మొక్కలు కూలీలతో తీయించాలి.

కలువు ముందుల వినియోగం :

మిర్చి తోటలలో పెండిమిథాలిన్‌ ౩౦ శాతం ఎకరానికి 1.00- 1.25 లీటర్లు 200 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే పిచికారి చేయాలి. విత్తిన వెంటనే పిచికారి చేయలేని పరిస్థితులలో విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయలి. మిరప నారు నాటుకునే పొలంలో, మొక్కలు నాటేముందు నేల పైన పెండిమిథాలిన్‌ పిచికారి చేసి, ఆ తరువాత మొక్కలు నాటాలి. మిరప పైరు పెరిగే దశలో గడ్డిజాతికి చెందిన కలుపు నివారణకు ఎకరానికి 250 మి.లీ. ఫెనాక్సాప్రావ్‌ 9% (లేకు 400 మి.లీ. క్విజాలోఫాప్‌ 5% (లేక) 250 మి.లీ. ప్రాపాక్విజాఫాప్‌ 10 శాతం 200 లీటర్లు నీటిలో కలిపి విచికారి చెయ్యాలి.

ఈ మందులు వాడినపుడు మిరప పైరు 4-5 రోజులు కొంచెం పసుపు రంగుకు మారి ఎదుగుదల తగ్గుతుంది. 7-10 రోజులకు సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి వర్షాలు ముసురుగా కురుస్తూ అంతర సేద్యానికి అవకాశం లేనపుడు మాత్రమే ఈ మందులు వాడాలి. మిరవ పెరిగే దశలో ఆశించే వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు విచికారి చేసే కలుపు మందులు ప్రస్తుతం ఏమి అందుబాటులో లేవు.

మిరపలో తఫతఫాలుగా నీరు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి, నీరు కట్టిన ప్రతీసారి కూడా కలుపు మొలిచే అవకాశం ఉంటుంది. పైరులో సాళ్ళుకమ్ముకున్న తరువాత కలుపు వలన పెద్దగా సమస్య లేనప్పటికిని, పాయలాకువంటి కలుపు ఆశించినపుడు పైరు నీడలోకూడ పెరుగుతూ నష్టం కలుగజేన్తుంది. అటువంటి పరిస్థితులలో బాగా పెరిగిన మిరప పైరులో నీరుకట్టి నేల బాగా తడిగా ఉన్నపుడు ఆక్సిఫ్లూరో ఫెన్‌ 23.5% ఎకరానికి 200 మి.లీ. కలుపు మందు 10 కిలోలు ఇసుకలో కలువుకుని మిరప మొక్కల పైన పడకుండ సాళ్ళమధ్యలో నేలమీద పడేటట్లు చల్లినపుడు పాయలాకు కలుపును నివారించవచ్చు. ఈ మందు మిరప మొక్కలమీద పడితే అకులు మాడిపోయే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తగిన జ్యాగ్రత్తలు పాటించాలి.