Vijayawada Book Festival
Vijayawada Book Festival : విజయవాడ పుస్తక ప్రియులను అలరించటానికి 32వ పుస్తక ప్రదర్శన రేపు విజయవాడలో ప్రారంభమవుతోంది. బందరురోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జనవరి 1నుంచి 11 వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవంలో 210 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు తెలిపారు.
Also Read : Fire Accident : ఇల్లు తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తి
దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్ధలు ఈ ప్రదర్శనలో పాల్గోంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుస్తక ప్రదర్శను ప్రారంభిస్తారు. జనవరి 4వ తేదీన ప్రెస్ క్లబ్ నుంచి బందరు రోడ్ స్వరాజ్య మైదాన్ వరకు పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహించనున్నారు. జనవరి 11వ తేదీ చివరి రోజు వీడ్కోలు సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8-30 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. కోవిడ్ నిబంధనల మేరకు బుక్ ఫెస్టివల్ లోకి రానిస్తామని, మాస్క్ లు ధరించి రావాలని, శానిటైజర్లు యూస్ చేయాలని బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు.