Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 101 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు. ఇక మరికొన్ని జిల్లాల్లో మాత్రం సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతుండగా.. రెండు మూడు జిల్లాలో డబుల్ డిజిట్ కేసులు వెలుగుచూస్తున్నాయి. సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 18,730 పరీక్షలు నిర్వహించగా 101 కేసులు వెలుగుచూసినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.

చదవండి : Corona Virus: ఒమిక్రాన్‌పై WHO సూచనలు.. ముఖ్యమైన 5పాయింట్లు ఇవే!

కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,439కి చేరింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో 138 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య 20,56,184కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,102 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా బులిటెన్‌లో పేర్కొన్నారు.

చదవండి : Corona Virus: సెకండ్ వేవ్‍కి కారణమైన డెల్టా కంటే 6 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి.. వ్యాక్సిన్ కూడా పనిచేయట్లేదు

ట్రెండింగ్ వార్తలు