Corona Virus: ఒమిక్రాన్‌పై WHO సూచనలు.. ముఖ్యమైన 5పాయింట్లు ఇవే!

కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ బి.1.1.529(ఓమిక్రాన్) రాకతో ప్రపంచం మొత్తం మళ్లీ భయం గుప్పెట్లోకి జారుకుంది.

Corona Virus: ఒమిక్రాన్‌పై WHO సూచనలు.. ముఖ్యమైన 5పాయింట్లు ఇవే!

Omicran

Corona Virus on WHO: కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ బి.1.1.529(ఓమిక్రాన్) రాకతో ప్రపంచం మొత్తం మళ్లీ భయం గుప్పెట్లోకి జారుకుంది. ‘ఓమిక్రాన్‌’ వేరియెంట్‌ వచ్చిన చాలామంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నవారే. ఇక్కడో విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ వ్యక్తి దగ్గర్నుంచి ఎదుటి గదిలో ఉన్న వ్యక్తికి కూడా ‘డెల్టా’ వేరియెంట్‌ కంటే వేగంగా కరోనా సోకుతుంది.

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ సరికొత్త కరోనా వేరియంట్‌ పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తమవగా.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ కొన్ని సూచనలు చేసింది. కొత్తగా ఉద్భవించిన ఆందోళన బి.1.1.529(ఓమిక్రాన్) మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్‌టెయిల్ చికిత్సలకు కూడా స్పందించకపోవచ్చని నిపుణులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే WHO ఐదు ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.

WHO సూచనలు:

WHO ప్రకారం, ఓమిక్రాన్‌తో మళ్లీ కరోనా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇంతకుముందు COVID-19 వచ్చిన వ్యక్తులకు ఈ వేరియంట్‌ మరింత సులభంగా సోకవచ్చు

సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్‌లతో పోలిస్తే ‘ఓమిక్రాన్’ మరింత వేగంగా వ్యాపిస్తుంది. అయితే, అది ఎన్ని రెట్లు అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి, RT-PCR పరీక్షల్లో స్ట్రెయిన్‌ను గుర్తించవచ్చు.

వ్యాక్సిన్‌లపై ఈ వేరియంట్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి WHO టెక్నికల్ టీమ్‌తో కలిసి పనిచేస్తుంది. అయితే, కొన్ని నివేదికలు మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్నా ఓమిక్రాన్ వచ్చేస్తున్నట్లు చెబుతున్నాయి.

ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా? లేదా? అనేదానిపై స్పష్టతలేదు. ఓమిక్రాన్‌ కొత్త వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కేసులు.. ప్రాథమిక డేటా చూస్తుంటే.. ‘ఓమిక్రాన్’తో కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. పూర్తిస్థాయిలో ఈ వేరియంట్ తీవ్రతని అర్థం చేసుకోవడానికి రోజుల నుంచి వారాల సమయం పట్టవచ్చు అని WHO అంచనా వేస్తుంది.

Dollar Seshadri : డాలర్ శేషాద్రి కన్నుమూత, ఉప రాష్ట్రపతితో సహా ప్రముఖుల సంతాపం