AP Covid Live Updates: ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 10,175 పాజిటివ్ కేసులు

AP COvid Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 72,229 శాంపిల్స్ పరీక్షించారు.. రాష్ట్రంలో కొత్తగా 10,175 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి.
మరో 68 మంది మృతిచెందారు. ఏపీ ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. ఇప్పటివరకూ 4,702 మంది మృతిచెందారు. ప్రస్తుతం 97,338 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 4,35,647 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఏపీలో ఇప్పటివరకూ 43లక్షల 80వేల 991 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా వల్ల చిత్తూరులో 9 మంది, కడపలో 9 మంది, నెల్లూరులో 9మంది, కృష్ణలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు మరణించారు.
శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 10,040 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 43,80,991 శాంపిల్స్ పరీక్షించారు.