చుక్కలు చూపెడుతున్న చికెన్ రేట్లు

  • Published By: vamsi ,Published On : May 17, 2020 / 07:53 AM IST
చుక్కలు చూపెడుతున్న చికెన్ రేట్లు

Updated On : May 17, 2020 / 7:53 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా.. వేసవిలోనూ చికెన్ తినేవాళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి ఛికెన్ థరలు. కిలో చికెన్‌ ధర ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.290 పలుకుతుంది. తెలంగాణలో అన్నీ చోట్ల కూడా ఇదే రేటు పలుకుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయతే ఏకంగా చికెన్ రేటు రూ. 300 మార్క్ చేరుకుంది. ఆదివారం చికెన్ కొందామని మార్కెట్లోకి వచ్చిన ప్రజలు ధరల గురించి తెలుసుకుని ఖంగుతిన్నారు. వేసవిలో ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఇదే తొలిసారని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో చికెన్  ధర‌ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

కరోనా వచ్చిన కొత్తల్లో వచ్చిన వదంతుల కారణంగా కొన్ని రోజుల క్రితం వరకు కోడి మాంసం ముట్టేందుకు బెదిరిపోయారు ప్రజలు. అయితే ఇప్పుడు మళ్లీ చికెన్, మటన్ కొనేందుకు ఎగబడుతున్నారు. మరోవైపు మటన్ ధరలు కూడా వెయ్యి మార్క్‌కు చేరువైంది.