Andhra Pradesh : కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే

ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి.

AP Covid 19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 693 మందికి కరోనా సోకింది. 06  మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,53,104 పాజిటివ్ కేసులకు గాను…20,30,552 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

Read More : Russia to invite Taliban : తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా యత్నాలు..అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు

14 వేల 242 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 8 వేల 310గా ఉందని తెలిపింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా 178 మంది వైరస్ బారిన పడ్డారు. 48 వేల 235 శాంపిల్స్ పరీక్షించగా…693 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. కోవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావర జిల్లాలో ఒక్కోక్కరు చొప్పున మరణించారు.

Read More :  Samantha : ఎఫైర్లు, అబార్షన్లపై సమంత ఘాటు స్పందన

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 09. చిత్తూరు 93. ఈస్ట్ గోదావరి 178. గుంటూరు 91. వైఎస్ఆర్ కడప 15. కృష్ణా 76. కర్నూలు 06. నెల్లూరు 72. ప్రకాశం 59. శ్రీకాకుళం 11. విశాఖపట్టణం 43. విజయనగరం 06. వెస్ట్ గోదావరి 34. మొత్తం : 693.

ట్రెండింగ్ వార్తలు