Russia to invite Taliban : తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా యత్నాలు..అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు

తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు తాలిబన్ల నేతలకు పిలవనుంది.

Russia to invite Taliban : తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా యత్నాలు..అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు

Russia To Invite Taliban

Russia to invite Taliban on October 20 : అఫ్గాన్ ను తాలిబన్లు కైవశం చేసుకున్నాక అక్కడ ఎటువంటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో ప్రపంచ దేశాలన్నీ తెలుసుకుంటున్నాయి. అఫ్గాన్ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యంగా రష్యాకు ఇప్పుడు తమ భూబాగంలోకి తాలిబన్లు ఎక్కడ చొరబడతారోనని ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో తాలిబన్లతో చర్చలు జరిపి శాంతి ఒప్పందం చేసుకునేదిశగా అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగా రష్యా రాజధాని మాస్కోలో సమావేశం ఏర్పాటు సన్నాహాలు చేస్తోంది.దీంట్లో భాగంగానే అఫ్గానిస్తాన్‌ పరిణామాలపై చర్చించడానికి రష్యా అక్టోబర్ 20న ఒక అంతర్జాతీయ సదస్సుని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సదస్సుకి తాలిబన్లను కూడా ఆహ్వానిస్తుందనే వార్తలు వస్తున్నారు.

Read more : Afghanistan : అఫ్ఘాన్ లో 13 మంది హజారాలను దారుణంగా హత్యచేసిన తాలిబన్లు

ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రత్యేక ప్రతినిధి జమీర్‌ కబులోవ్‌ తెలిపారు. ‘‘అక్టోబర్ 20 న రష్యా రాజధానిలో అఫ్గన్‌ అంశంపై చర్చించేందుకుగాను తాలిబాన్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించామని తెలిపారు. అయితే ఈ మాస్కో ఫార్మట్‌ చర్చలకు హాజరవుతున్న తాలిబన్‌ ప్రతినిధులు ఎవరనేదాని గురించి సమాచారం లేదనీ… తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న క్రమంలో అఫ్గాన్ లో తలెత్తిన మానవతా విపత్తును నివారించడానికి ఈ చర్చలు సాయం చేస్తాయని.. రష్యా ఈ విషయంలో అఫ్గన్‌కు సాయం చేస్తుందని కాబులోవ్‌ తెలిపారు. ప్రస్తుతం దీని గురించి చర్చిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

కాగా..అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని స్వాధీనం చేసుకునే ఒక నెల ముందు అంటే జూలైలో కూడా తాలిబన్లు రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. దీనిపై అమెరికా రష్యాపై పలు విమర్శలు కూడా చేసింది. అఫ్గనిస్తాన్‌లో అమెరికా సైనికులను చంపడానికిగాను రష్యా తాలిబన్లకు బహుమతులను అందిస్తుందని ఆరోపించింది. అయితే రష్యా మాత్రం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే ఎంతమాత్రం వాస్తవం కాదు అంటూ తీవ్రంగా ఖండించింది.

Read more : Afghanistan : అప్ఘానిస్తాన్ లోని ఓ మసీదులో భారీ పేలుడు

తమ భూభాగంలోకి ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ఎక్కడ చొరబడతారోనన్న ఆందోళనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే తజికిస్తాన్‌ అధ్యక్షుడు ఎమోమాలి రఖ్‌మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మధ్య ఆసియాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. కాగా..ఆఫ్ఘనిస్తాన్ మాజీ సోవియట్ తజికిస్థాన్‌తో సరిహద్దుతో ఉంది. ఆ సరిహద్దులో రష్యా కీలక సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది.కాగా..ఇప్పటికే తాలిబన్లకు చైనా, అఫ్గాన్ సరిహద్దు దేశమైన పాకిస్థాన్ మద్దతునిచ్చిన విషయం తెలిసిందే.