Afghanistan : అఫ్ఘాన్ లో 13 మంది హజారాలను దారుణంగా హత్యచేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్‌ లో మైనారిటీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వారిపై దాడులు చేసి హత్య చేస్తున్నారు.

10TV Telugu News

Afghanistan :  ఆఫ్ఘనిస్తాన్‌ లో మైనారిటీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వారిపై దాడులు చేసి హత్య చేస్తున్నారు. అఫ్ఘాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నాటి నుంచి అకృత్యాలు పెరిగిపోయాయి. మైనారిటీ వర్గాలపై దాడులు అధికమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అఫ్ఘాన్ లో నెలకొన్న పరిస్థితిపై దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. అఫ్ఘాన్ లో మైనారిటీ వర్గాలపై దాడులు అధికమయ్యాయని.. తాలిబన్ల బాధలు తట్టుకోలేక హజారాలు (షియా ముస్లింలు) గ్రామాలు వదిలి వెళ్లారని పేర్కొంది.

Read More : Afghanistan : కాబుల్ లో బాంబు దాడి 14 మంది మృతి

ఇక ఇప్పటివరకు 13 మందిని క్రూరంగా హత్యచేశారని పేర్కొంది. ఆగస్టు 30న మధ్య అఫ్ఘానిస్తాన్‌లోని డేకుండి ప్రావిన్స్‌లోని కహోర్ గ్రామంపైకి దాదాపు 300 మంది తాలిబాన్‌లు దాడి జరిపి ఈ హత్యలకు పాల్పడ్డారు. బాధితుల్లో 11 మంది అఫ్ఘాన్ జాతీయ భద్రతా దళ సభ్యులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. వీరిలో 17 ఏండ్ల వయసున్న బాలిక కూడా ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రెండు వారాల తర్వాత ఈ హత్యలకు పాల్పడినట్లు అమ్నెస్టీ పేర్కొంది.

 Read More : Afghanistan : ఉగ్రవాదుల కాల్పుల్లో జర్నలిస్టు మృతి

సున్నీ మెజారిటీ దేశమైన అఫ్ఘాన్ లో తరచుగా షియా ముస్లిమ్స్ పై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆఅఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ భయంకరమైన దుర్వినియోగాలకు పాల్పడుతున్నారనే దానికి ఈ హజారాల హత్యలే నిదర్శనమని అమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్మార్డ్ తెలిపారు. దీనిపై కామెంట్‌ చేసేందుకు తాలిబాన్‌ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్‌, బిలాల్‌ కరీమీలు నిరాకరించారు. దారుణంగా కొట్టి చంపుతున్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. గ్రామాల్లోని హజారాలు ప్రాణభయంతో అడవుల్లోకి వెళితే తాలిబన్లు వారి ఇళ్లను లూటీ చేసి.. వస్తువులను ఎత్తుకెళ్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని అమ్నెస్టీ పేర్కొంది.