Afghanistan : ఉగ్రవాదుల కాల్పుల్లో జర్నలిస్టు మృతి

ఆఫ్ఘానిస్తాన్‌లోని తూర్పు ప్రావిన్స్ నంగర్‌హార్‌లో జరిగిన కాల్పుల్లో జర్నలిస్టుతో సహా ముగ్గురు సామాన్య పౌరులు మరణించినట్లు అధికారులు ఆదివారం ధృవీకరించారు.

Afghanistan : ఉగ్రవాదుల కాల్పుల్లో జర్నలిస్టు మృతి

Afghanistan

Afghanistan : ఆఫ్ఘానిస్తాన్‌లోని తూర్పు ప్రావిన్స్ నంగర్‌హార్‌లో జరిగిన కాల్పుల్లో జర్నలిస్టుతో సహా ముగ్గురు సామాన్య పౌరులు మరణించినట్లు అధికారులు ఆదివారం ధృవీకరించారు. “జర్నలిస్ట్ మరియు రచయిత సయ్యద్ మరోఫ్ సాదత్ తన బంధువులతో కలిసి శనివారం సాయంత్రం జలాలాబాద్ నగరంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ 5 లో రహదారి వెంబడి కారులో ప్రయాణిస్తుండగా, రిక్షాలో వచ్చిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు” అని భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో సాదత్ అక్కడిక్కడే మృతి చెందగా.. సాదత్ కుమారుడు, వాహనం డ్రైవర్ గాయపడినట్లు సమాచారం.

Read More : Pak Drone : పాకిస్తాన్ నుంచి జమ్మూకి డ్రోన్ ద్వారా ఆయుధాలు

స్వతంత్ర ఆఫ్ఘన్ మీడియా గ్రూప్ ఆఫ్ఘన్ జర్నలిస్ట్స్ సేఫ్టీ కమిటీ (AJSC) ఈ హత్యను ఖండించింది. కాల్పుల బాధ్యతను ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. తాలిబాన్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు మధ్యలో తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్‌కు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాలాబాద్‌లో కనీసం 10 మంది హత్యకు గురయ్యారు. అనేక మంది గాయపడ్డారు. అయితే తాలిబన్ పాలనను వ్యతిరేకించే వారు ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Read More : Sexual Abuse On Dog : కుక్కపై లైంగిక దాడికి పాల్పడిన వృధ్దుడు