తన యేడాది పాలనపై సీఎం జగన్ మనసువిప్పి మాట్లాడారు. ఎమోషనల్ అయ్యారు. ప్రజలకు చిత్తశుద్ధితో మంచి చేద్దామనుకొంటున్నా… అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూములను తీసుకొంటే కోర్టుకెళ్లేవాళ్లని చూశా. పేదలకు భూములను ఇస్తుంటే కోర్టుకెళ్లేవాళ్లను ఇప్పుడే చూస్తున్నానని అన్నారు. వివక్షలేదు, లంచాలు ల్లేవ్…అవినీతి లేదు….సరాసరి నేరుకుగా ప్రజలకు డబ్బు అందుతోంది. ఆసుపత్రులను మార్చేస్తున్నాం. ప్రేవేట్ స్కూల్స్‌ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా. రైతును రాజు చేస్తున్నా. ఇది ప్రజాసంక్షేమంపై నా సంతకమని గర్వంగా చెప్పారు సిఎం జగన్.
ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో 90శాతం వాగ్దానాలను అమలు చేసే దిశగా అడుగులు వేయడం ఎంతో గర్వంగా ఉందని జగన్ చెప్పారు. శనివారం ఆయన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ (155251)కాల్ సెంటర్‌ను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఒకేసారి 5 లక్షలమంది రైతులను ఉద్దేశించి లైవ్ మీడియాలో ప్రసంగించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించి యాప్ ప్రారంభించిన ఆయన.. ఆల్‌ది బెస్ట్ అంటూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ మెసేజ్ పంపించారు. మాది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. 49 లక్షల రైతుల కుటుంబాలకు రూ.10వేల కోట్లకు పైగా వారి బ్యాంకు అక్కౌంట్లలో వేశామని గుర్తు చేశారు. 40,627 కోట్లను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజల బ్యాంకు అక్కౌంట్లకే చేర్చగలిగామని సీఎం జగన్ లైవ్ మీడియాలో పేర్కొన్నారు.
రైతుకు అవసరం ఉన్నప్పుడు సహాయం అందాలని చెప్పారు. రైతుకు పెట్టుబడి సహాయం అందాలని, పంటకు గిట్టుబాటు ధర రావాలని తెలిపారు. విపత్తు వస్తున్నప్పుడు రైతును ఆదుకోవాలని చెప్పారు. వ్యవసాయం లాభసాటి మారాలంటే.. ఈ మూడు అంశాల్లో ముందడుగు పడాలని తెలిపారు. దీనికోసమే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విత్తనం నుండి.. పంట అమ్మకం వరకూ… రైతు భరోసా కేంద్రాలు అండగా ఉంటాయని చెప్పారు. ఏడాది పాలన నిజాయితీతో, చిత్త శుద్ధితో, నిబద్ధతతో జరిగిందని, 11 ఏళ్లుగా రాజకీయ ప్రయాణం కొనసాగిందని సీఎం జగన్ తెలిపారు.
కోట్లమందిని కలిశానని, రాష్ట్రం నలుమూలలా ఏమూల కూడా విడిచిపెట్టకుండా ప్రతి ప్రాంతంలోని సమస్యను అర్థం చేసుకోవడానికి అడుగులు వేశానని అన్నారు. నేను తిరగని ప్రదేశం లేదు.. జిల్లా లేదని ప్రతి గ్రామాన్ని దాదాపుగా ఎక్క డోచోట.. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో టచ్ చేసే ఉంటానని తెలిపారు. ప్రజల సమస్యల విన్నప్పుడు నా మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయని చెప్పారు. తల్లిదండ్రులు చదువులు ఎందుకు చదివించ లేకపోతున్నారో తన మనసు నిండా ఆలోచనలు కదిలాయని తెలిపారు. ఇష్టంలేక కాదు.. చదివించే స్తోమత లేక అని వైద్యం కోసం అప్పులు పాలైన ఘటనలు కోకొల్లలు అంటూ గుర్తు చేసుకున్నారు.
వైద్యం అందించాలనే చిత్త శుద్ధిలేని రాజకీయ వ్యవస్థను చూశానని, రైతుల సమస్యలను చూశాని చెప్పుకొచ్చారు. పెట్టుబడులకు డబ్బల్లేని పరిస్థితిని చూశాని సీఎం వాపోయారు. గిట్టుబాటు ధరల్లేక పంటలను పొలాల్లోనే విడిచిపెట్టిన పరిస్థితిని చూశానని చెప్పారు. నా ఆడపడుచులను చూశాను… వారిని బాగా చూసుకోగలిగితేనే కుటుంబం బాగుంటుందని, వారి కళ్లల్లో కన్నీరే రాకూడదని ఆరాపటడే ప్రభుత్వం మాదన్నారు. ఎక్కడిపడితే.. అక్కడ మద్యం అమ్మడాన్ని చూశానని, పేదరికం నుంచి ఒక కుటుంబాన్ని ఎలా బయటకు తీయాలో 11 ఏళ్లుగా నా రాజకీయ ప్రస్థానంలో చూశానంటూ జగన్ వివరించారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా మేనిఫెస్టోను చూశానని స్పష్టం చేశారు. నా ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలిపారు. కులాలు, మతాలు, రాజీకీయాలు చూడకుండా అర్హత ఉంటే.. పథకాలు ఇవ్వాలని ఆలోచనలు చేసినట్టు పేర్కొన్నారు. మేనిఫెస్టో కూడా రెండే రెండు పేజీల్లో పెట్టానన్నారు.
మేనిఫెస్టో భగవద్గీత అని, బైబిలు అని ఖురాన్ అని నమ్మానని పునరుద్ఘాటించారు. ప్రజలకు నవరత్నాలను తీసుకు వెళ్లగలిగితే వారి జీవితాలు బాగుపడ్డాయని నమ్మినట్టు జగన్ తెలిపారు. అవ్వా తాతలమీద గుండెలనిండా ప్రేమతో, అక్కచెల్లెమ్మల మీద మమకారంతో, రైతులమీద బాధ్యతతో అడుగులు వేశామని తెలిపారు. మేం ఇచ్చిన హామీలు మొత్తం 129 అయితే.. అమల్లోకి వచ్చినవి 77, అమలుకోసం ప్రారంభోత్సవాల డేట్స్ ఇచ్చినవి 36 ఏడాది పాలనలో 90శాతం అమల్లోకి తీసుకు వచ్చామన్నారు. 16 మాత్రమే అమలు కావాల్సినవి ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అమలు చేయడానికి పరుగులు పెట్టిస్తామని, మేనిఫెస్టోలో లేకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40 అమలు చేసినట్టు చెప్పారు.
Read: బెంజ్ రోడ్డులో 1060…108, 104 కొత్త వెహికల్స్ ప్రారంభం – సీఎం జగన్