Cinema Ticket : నేడు సినిమా టిక్కెట్‌ ధరలపై కీలక భేటీ

భేటీ అయిన తర్వాత టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది. ఇప్పటికే టిక్కెట్ల ధరల ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.

Cinema

a key meeting on Cinema ticket : ఏపీలో సినిమా టిక్కెట్‌ ధరలపై ఇవాళ ఓ క్లారిటీ రానుంది. టిక్కెట్‌ ధరలపై ఏర్పాటైన కమిటీ సచివాలయంలో ఇవాళ ఉదయం 11.30 గంటలకు సమావేశం కానుంది. భేటీ అయిన తర్వాత టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది. ఇప్పటికే టిక్కెట్ల ధరల ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కొత్త ధరలతో ఈ నెల 25న విడుదలవుతున్న భీమ్లానాయక్, గని సినిమాలకు లాభం చేకూరనుంది.

ఫిబ్రవరి 10న తెలుగు సినిమా ప్రముఖులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలని అన్నారు. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని చెప్పారు. అందరికీ స్ధలాలు ఇస్తామని, స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామని, జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దామన్నారు. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టి పెట్టండి అని జగన్ అన్నారు.

Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కమిటీ ఏర్పాటు

తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. ఏపీలో జనాభా, థిటయేటర్లు ఎక్కువ..ఆదాయం కూడా ఎక్కువేనని తెలిపారు. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోందని.. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోందని చెప్పారు. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ అన్నారు. వాతావరణం కూడా బాగుంటుందన్నారు.

సినిమా పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమలో భూసేకరణకు నిర్ణయించింది. సినిమా షూటింగ్ లు, స్టూడియోల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భూనిధి ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ప్రైవేట్ గా స్టూడియోలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమల్లో.. సినీ పరిశ్రమ కోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Balakrishna : ఏపీ సినిమా టికెట్ల ధరలపై బాలయ్య కీలక వ్యాఖ్యలు

సినిమా షూటింగ్, స్టూడియోల కోసమే ఈ భూములను వినియోగించనుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి ప్రాంతాల్లో.. భూనిధి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారానే.. ఆ భూములను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు విధానాల ద్వారా స్టూడియోల నిర్మాణానికి కసరత్తు చేయాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది. నిర్మాణం-నిర్వహణ-బదిలీ విధానంలో స్టూడియోలు.. ఏర్పాటు చేసేందుకు బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్టూడియోల నిర్మాణాలకు కూడా భూములు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.