Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కమిటీ ఏర్పాటు

ఏపీలో సినిమా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్‌గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Movie Tickets: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కమిటీ ఏర్పాటు

Theatres

Updated On : December 28, 2021 / 9:41 AM IST

Movie Tickets: ఏపీలో సినిమా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్‌గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

కమిటీలో సభ్యులుగా రెవెన్యూ, MA అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు ఐ అండ్ పీఆర్ కమిషనర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సినీ గోయర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులకు చోటు దక్కింది.

మరోవైపు జీవో నంబర్‌ 35పై ఏపీ ప్రభుత్వంతో చర్చలకు రెడీ అయ్యారు ఎగ్జిబిటర్స్‌. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానితో ఇవాళ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరుగనుంది.

ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్లు నాని అపాయింట్‌మెంట్‌ కోరినా.. ఆయన మాత్రం ఎగ్జిబిటర్స్‌తోనే మాట్లాడేందుకు అంగీకరించారు. 20 మంది ఎగ్జిబిటర్లతో ఆయన చర్చలు జరుపనున్నారు. దీంతో సమావేశంలో ఏం చర్చిస్తారు? ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను నాని దృష్టికి తీసుకెళ్లనున్నారు థియేటర్‌ యజమానులు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో థియేటర్‌ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ సాధక బాధకాలను మంత్రితో చర్చించనున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో థియేటర్లు నడిపే పరిస్థితి లేదని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరే అవకాశముంది. అంతేకాదు.. సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరే చాన్స్‌ ఉంది.