ACB Searches : పంచాయతీ కార్యదర్శి ఇంట్లో రూ.35 లక్షలు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. పైడిభీమవరంతో పాటు నెల్లిమర్ల, రాజాంలో సోదాలు కొనసాగున్నాయి.

ACB Searches : పంచాయతీ కార్యదర్శి ఇంట్లో రూ.35 లక్షలు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

Acb Searches

Updated On : April 16, 2021 / 5:39 PM IST

ACB searches the houses of Panchayat Secretary : శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. పైడిభీమవరంతో పాటు నెల్లిమర్ల, రాజాంలో సోదాలు కొనసాగున్నాయి. తనిఖీల్లో భారీగా ఆస్తులు వెలుగు చూస్తున్నాయి.

35 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు. బ్యాంక్‌ లాకర్ల కోసం ఆరా తీస్తున్నారు.

విశాఖలోని ఇంట్లో పలు బ్యాంకుల పాస్‌ బుక్‌లను గుర్తించారు. ఇంతవరకు ఐదు కోట్ల ఆస్తులను గుర్తించారు.