Sri Reddy: విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. గత ఏడాది నవంబర్ 13న శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీరెడ్డిని విచారించిన పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే, అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో నటి శ్రీరెడ్డి బూతులతో రెచ్చిపోయిందని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ టార్గెట్ గా అసభ్యకర పోస్టులు పెట్టారంటూ గత ఏడాది నవంబర్ 13న నెల్లమర్లకు చెందిన కౌన్సిలర్ కళావతి నెల్లమర్ల పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో ఉంటున్న శ్రీరెడ్డికి స్వయంగా వెళ్లి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి పూసపాటిరేగ పీఎస్ లో విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆర్డర్ తో శ్రీరెడ్డి వచ్చారు. దాంతో పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాలన్నారు.
Also Read: కూటమిదే పీఠం.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గి జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి
తమ నాయకులు చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని.. పార్టీలు, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here