GVMC: కూటమిదే పీఠం.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గి జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.

GVMC
GVMC: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. శనివారం ఉదయం 11గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంకు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ ప్రక్రియ జరిగింది.
Also Read: GVMC: విశాఖ మేయర్‌పై ఏప్రిల్ 19నే అవిశ్వాసం ఎందుకు..? నాలుగేళ్ల నిబంధనే కారణమా..
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటేశారు. దీంతో జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానంను నెగ్గడంతో గేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి చేరింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.