Meena and Ramyakrishna Support Roja
Meena and Ramyakrishna Support Roja : ఏపీ మంత్రి రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా బండారు వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజా సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు ఆమెకు మద్దతుగా నిలిచారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినీ నటీమణులు మీనా, రమ్యకృష్ణ రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు అసభ్యకరమైన వ్యాఖ్యలపై మండిపడ్డారు. బండారు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. రోజాతో తాను కలిసి నటించానని మీనా అన్నారు. రోజా గురించి తనకు బాగా తెలుసన్నారు. ఒక మహిళ జీవితంలో ఎదుగుతుంటే ఇలానే మాట్లాడుతారా…? అని ప్రశ్నించారు.
ఇలా మాట్లాడితే మహిళలు ఇంటికే పరిమితం అవుతారు అనుకోకండి అని అన్నారు. ఇంత నీచంగా మాట్లాడడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా గురించి తనకు బాగా తెలుసు… తను చాలా స్ట్రాంగ్ మహిళా అని అన్నారు.
రోజాకు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది ఆమెకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి రోజాకు అండగా సినీ నటి రమ్యకృష్ణ మద్దతుగా తెలిపారు. బండారు సత్యానారాయణ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. బండారు వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు.