Radikaa Sarathkumar : బండారు క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి రోజాకు నటి రాధిక మద్దతు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం

ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. Radikaa Sarathkumar

Radikaa Sarathkumar : బండారు క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి రోజాకు నటి రాధిక మద్దతు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం

Radikaa Sarathkumar Supports Roja (Photo : Twitter, Google)

Updated On : October 6, 2023 / 9:40 PM IST

Radikaa Sarathkumar – Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రోజాకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : మంత్రి రోజాకు బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. చెప్పే వరకు పోరాడతా : ఖుష్బూ

తాజాగా మరో సినీ నటి రాధిక సైతం స్పందించారు. మంత్రి రోజాకు ఆమె మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు.

”రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళలను వ్యభిచారులుగా చిత్రీకరిస్తారా? దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి” అని నటి రాధిక అన్నారు.

Also Read : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్

నటి ఖుష్బూ సైతం రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రోజాకు తక్షణమే క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు ఖుష్బూ. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమన్నారు ఖుష్బూ.