ఏయ్ కేఏ పాలూ.. నీ దేవునితో చెప్పి కరోనాని తీసెయ్యమని చెప్పు: RGV

ఏయ్ కేఏ పాలూ.. నీ దేవునితో చెప్పి కరోనాని తీసెయ్యమని చెప్పు:  RGV

Updated On : March 19, 2020 / 5:25 AM IST

సంచలనాల డైరక్టర్, వివాదాల రామ్ గోపాల్ వర్మ.. ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్‌కు సవాల్ విసిరారు. చెప్పొచ్చు కదరా సుబ్బారావు అంటూ సెటైర్ వేశారు. ఎంకమ్మ నాకు కరోనా వచ్చేటట్లు చెయ్యి అంటూ సవాల్ విసిరారు. అసలు ఈ ఛాలెంజ్‌లు, సవాళ్లు విసరడానికి ముందు కేఏ పాల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు భారీ బంపర్ అంటూ ఓ వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టారు. 

‘దేవుడు స్వార్థాన్ని, అన్యాయాన్ని, అవినీతిని సహించలేడు. దేవుడికి కోపం వచ్చింది. అందుకే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. చిట్టి వలస దగ్గర 25ఎకరాల్లో 100గదులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాడుకోవచ్చని చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ నుంచి గంట ప్రయాణం దూరంలో వెయ్యి ఎకరాల్లో 300గదుల కంటే ఎక్కువ ఉన్నాయి. వాటిని ఉచితంగా వాడుకుని కరోనాను తగ్గించేందుకు వాడుకోండి. నేను సీక్రెట్ గానే సహాయం చేద్దామనుకున్నా. వాళ్లు రెస్పాండ్ అవ్వలేదని ఇలా చెప్తున్నా’ అని కేఏ పాల్ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టారు. 

దానిపై అదే మెసేజ్‌ను ట్విట్టర్లో పెట్టారు. వీటిపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘ఏయ్ కేఏ పాల్. ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసెయ్యమని చెప్పొచ్చు కదరా సుబ్బారావు. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకి నాకు కరోనా వచ్చేట్టు చెయ్యి ఎంకమ్మా’ అంటూ సెటైర్ విసిరారు. 

ఈ ట్వీట్ తో పాటు మరో ట్వీట్ చేస్తూ.. దేవుడికి, కరోనాకి ఏదో సీక్రెట్ ఎఫైర్ ఉన్నట్లుంది. వాళ్లిద్దరి లవ్ స్టోరీలో మనుషులంతా విలన్లులా ఉన్నారు. అంటూ మరో ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ చేస్తే.. వైరల్ కాకుండా ఉంటదా.. క్షణాల్లో వైరల్ అవడంతో సెటైర్లు, కామెంట్లు వరదల్లా వస్తున్నాయి. కేఏ పాల్ కు వేసిన కౌంటర్ ట్వీట్ ను 6వేల మంది లైక్ చేయగా, 6వందల మంది రీట్వీట్ చేశారు. 

Also Read |  కరీంనగర్‌కు 100 వైద్య బృందాలు : ఆ 8 మంది ఎక్కడ తిరిగారు ? ఎవరిని కలిశారు ?